Ys Jagan Videos Viral On Social Media: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ మాటతీరు మారింది. గత కొద్ది రోజులుగా తాడేపల్లి ఫ్యాలెస్కే పరిమితమైన జగన్, తాజాగా మీడియా ముందుకు వచ్చారు. సీఎంగా పదవి కోల్పోయిన అనంతరం జగన్ తీరు చూసి, అందరూ నవ్వుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు విని అక్కడున్నవారే ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ... ‘‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం.. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు.. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి.. ఇప్పటి వరకూ సినిమాలో ఫస్ట్ ఆఫ్ మాత్రమే అయింది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గత ఐదేళ్లు కళ్లు మూసుకోవడమేంటి? అలా ఎలా మాట్లాడారు అంటూ ఆశ్చర్యపోవడం పార్టీ నేతలవంతు అయ్యింది.
నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు - చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు - Chandrababu Take Charge as CM