తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏం జగన్ నోరువిప్పవే? నీ చెల్లెళ్లకు సమాధానం చెప్పవేం?' - ఏపీ ముఖ్యమంత్రికి వివేకా సతీమణి లేఖ - YS VIVEKA WIFE LETTER TO JAGAN - YS VIVEKA WIFE LETTER TO JAGAN

YS Vivekananda Reddy Wife Sowbhagyamma Letter to AP CM Jagan : ఏపీ సీఎం జగన్‌కు వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా? హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం తగునా అంటూ జగన్​ను ప్రశ్నించారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 12:25 PM IST

YS Viveka Wife Open Letter to Jagan :ఆంధ్రప్రదేశ్‌సీఎంగా చూడాలని తపించిన చిన్నాన్నను సొంత పత్రిక, ఛానెల్‌లో చెప్పలేనంతగా హహనం చేయడం తగునా జగన్‌ అంటూ వివేకా భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు నీవు ఎంత మనోవేదన అనుభవించావో, 2019లో సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని అన్నారు. కుటుబంలోని వారే తన భర్త హత్యకు కారణం కావడం, వారికి సీఎంగా నువ్వే రక్షణం ఉండటం ఎంతో బాధించిందని
సౌభాగ్యమ్య లేఖలో వెల్లడించారు.

YS Viveka Murder Case Updates : నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈ విధంగా నీ పత్రిక, ఛానెల్‌, సోషల్‌ మీడియాలో హననం చేయించడం తగునా అంటూ జగన్​ను లేఖలో ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా అని నిలదీశారు. సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా లక్ష్యంగా చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటని? అన్నారు. కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యమా అని సౌభాగ్యమ్య లేఖలో ప్రశ్నించారు.

'అన్నా' అని పిలుచుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు - వైఎస్ షర్మిల

వివేకానంద రెడ్డి హత్యకు కారకులైన వారికి తిరిగి ఎంపీగా అవకాశాన్ని కల్పించడం సమంజసమా అని సౌభాగ్యమ్మ ప్రశ్నించారు. ఇటువంటి దుశ్చర్యలు ఏ మాత్రం మంచిది కాదని, ఇది నీకు తగదని విన్నవించుకుంటున్నట్లు పేర్కొన్నారు. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం ఆలోచన చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా అంటూ కోరారు. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని, ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని వేడుకుంటున్నట్లు లేఖలో సౌభాగమ్య వెల్లడించారు.

నీ చిన్నానను చంపిన వాళ్లని పక్కన పెట్టుకుని - వారికే ఓటు వేయమని ఎలా అడుగుతున్నావు : సునీత - Sunita Requested Not To Vote YSRCP

హంతకుల పార్టీకి ఓటేయొద్దు - జగనన్న పార్టీ గెలవొద్దు : వైఎస్ సునీత

ABOUT THE AUTHOR

...view details