ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్, చంద్రబాబుకు షర్మిల లేఖ​ - అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్

YS Sharmila Letter to YS Jagan: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు.

ys_sharmila
ys_sharmila

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 3:49 PM IST

YS Sharmila Letter to YS Jagan: ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. ఇచ్చిన హామీల అమలు చేయాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభలో ఆమోదించాలన్నారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని షర్మిల కోరారు.

YS Sharmila Letter to Chandrababu: బీజేపీ 10 ఏళ్లుగా ద్రోహం చేసిందని ఆమె లేఖలో వివరించారు. పదేళ్లలో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని లేఖ ద్వారా గుర్తు చేస్తున్నానని తెలిపారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో జాప్యాన్ని ప్రభుత్వ, ప్రతిపక్షాల దృష్టికి వివరిస్తున్నట్లు లేఖ ద్వారా వివరించారు. రాష్ట్ర హక్కుల తీర్మానం కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వైఎస్సార్​సీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా పునర్విభజన చట్టంలో పొందుపరిచినట్లు, హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

పీసీసీ చీఫ్ షర్మిల కూడా సిద్ధమే! - జిల్లాల పర్యటన, బహిరంగ సభలు

AP Special Status: రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండేందుకు రూపొందించిన పునర్విభజన చట్టంలోని హామీలు పొందుపరచినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీలను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వివరించారు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆశలపై నీళ్లు చల్లినా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. ఇప్పటికైనా విభజన హామీల అమలు కోసం కృషి చేయాలని కోరారు.

ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే దిల్లీలో షర్మిల: ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్​ కమీటీ అధ్యక్షురాలు ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే దిల్లీలో దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాను, విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలుపరచాలని కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రంలో మధ్యంతర బడ్జెట్​ సమావేశాలు కొనసాగుతున్న వేళ షర్మిల లేఖ రాయడం, దీక్షకు దిగడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వైఎస్ షర్మిల, సునీతపై అసభ్యపోస్ట్​లు పెడుతున్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్

ABOUT THE AUTHOR

...view details