Youth Investments in Stock Market : అధిక ఆదాయం పొందాలనే దురాశతో కొంత మంది యువకులు భారీగా నష్టపోతున్నారు. అవగాహన లేక ఏ వ్యాపారంలో పడితే అందులో పెట్టుబడి పెట్టి అప్పులపాలవుతున్నారు. కరోనా సమయం నుంచి పొదుపు ఆలోచనలు ఎక్కువ చేస్తున్న యువత సరైన మార్గం ఎంచుకోక దాచుకున్న డబ్బులను ఇట్టే పోగొట్టుకుంటున్నారు. స్టాక్ మార్కెట్‌లోనూ సరైన విధానంలో డబ్బులు మదుపు చేయకుండా నష్టాలపాలవుతున్నారు. యువత ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది?. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై సర్టిఫైడ్ ఫైనాన్షియల్ మేనేజర్ సలహాలు, సూచనలను యువ మీకందిస్తోంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
"వారెన్ బఫెట్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఉన్నారు. వీళ్లను చూసే కదా మనం ప్రేరణ పొంది ఇన్వెస్ట్ చేసేది. వాళ్లు ఒకటే మాట చెప్తారు. స్టాక్ మార్కెట్‌లో షార్ట్‌కట్స్ ఉండవు. ముందుగా అధ్యయనం చేయండని అన్నారు. వాళ్ల లైఫ్ వేరు మన లైఫ్ వేరు. వాళ్ల పూర్తి స్థాయి జీవితం అదే. పెట్టుబడి పెట్టడం, ట్రేడింగ్ చేయటమే, కానీ మీ జీవితం అలా కాదు కదా. ఉద్యోగం చేయాలి, కుటుంబాన్ని పోషించాలి. స్టాక్ మార్కెట్‌పైనా అవగాహన ఉండటం లేదు" -చలమల రేవంత్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ మేనేజర్