తెలంగాణ

telangana

ETV Bharat / state

స్నేహితులకు వాట్సాప్​లో చనిపోతున్నట్లు యువకుడు స్టేటస్​ - రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్య - Lover suicide falling down train - LOVER SUICIDE FALLING DOWN TRAIN

Lover Suicide in Nalgonda : స్నేహితులకు వాట్సాప్​లో చనిపోతున్నట్లు స్టేటస్​ పెట్టి మరీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. యువకుడికి మృతికి ప్రేమనే కారణమని యువకుడి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.

Lover Suicide in Nalgonda
Lover Suicide in Nalgonda (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 10:44 PM IST

Young Man Commits Suicide After Falling Down Train : ప్రేమ మత్తులో తన ప్రేయసి వేరే వ్యక్తితో మాట్లాడుతుండడం తట్టుకోలేని ప్రేమికుడు. తన ఇంటికెళ్లి ఈ విషయంపై గొడవపడ్డాడు. ఆ యువతి బంగారు గొలుసు తీసుకుని వెళ్లిపోయాడు. దీనిపై యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయంతో ఆ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచిపెట్టాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. ఈ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంకు చెందిన తన్నీరు వెంకన్న వెంకమ్మల కుమారుడు సాయికిరణ్​ స్థానికంగా ఓ ప్రైవేట్​ సంస్థలో డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలిసి 2022లో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినాసరే వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో సదరు బాలిక వేరొకరితో మాట్లాడిందనే నెపంతో మంగళవారం రాత్రి సీతారాంపురంలోని బాలిక ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు.

ఈ క్రమంలో ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు సైతం తీసుకొని వెళ్లిపోయాడు. తన తండ్రి వస్తే ఇస్తానని చెప్పి అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ విషయంపై బాలిక తన తల్లితో మొత్తం విషయం చెప్పింది. బుధవారం మిర్యాలగూడలోని రెండో పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఆమె ఫిర్యాదు చేసింది. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయికిరణ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విషయంలో ఏఎస్​ఐ బాధితులకి ఫోన్​ చేసి బెదిరించినట్లుగా యువకుడు బంధువులు వాపోయారు.

వాట్సాప్​లో స్నేహితులకు ఆత్మహత్య స్టేటస్​ : అయితే కేసు నమోదు సమాచారం తెలుసుకున్న సాయికిరణ్​ రైల్వే ట్రాక్​ దగ్గరకు వెళ్లాడు. అనంతరం వాట్సప్​ స్టేటస్​లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితులకు సమాచారం అందించాడు. అనంతరం జన్మభూమి రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలు లోకోఫైలట్​ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో మృతి చెందింది సాయికిరణ్​గా పోలీసులు గుర్తించారు. ఈవిషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే యువకుడి ఫోన్​ మాత్రం తన కుటుంబాన్ని బెదిరిస్తుండడంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చాటింగ్​లో పేర్కొన్నాడు. తన కుమారుడి మరణానికి బాలిక తల్లిదండ్రులే కారణమని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సాయి కిరణ్​ చనిపోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణంలోని టూ టౌన్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం - ప్రేమ పెళ్లిగా మారేలోపు యువకుడు ఆత్మహత్య- ఏమైందంటే? - Young Man Suicide due to Love

Suicide: ప్రేమ విఫలం.. సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details