YCP leaders grabbed government land: ప్రభుత్వాధికారులు ఎన్నికల హడావిడిలో ఉండగా, అధికాపార్టీ నేతలు భూ కబ్జాలపై కన్నేసిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో కనిగిరి మున్సిపల్ కార్యాలయం కోసం కేటాయించిన భూమిని, వైసీపీ నేతలు రాత్రికి రాత్రే చదును చేశారు. శిలాఫలకాన్ని సైతం నామరూపాలు లేకుండా చేశారు. ప్రభుత్వ భూమిని వంతుల వారిగా ఆక్రమించే పనిలో పడ్డారు. భూమికి రక్షకులుగా ఉండాల్సిన ప్రభుత్వాధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా కనిగిరిలో నూతన మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు కోసం కొత్తూరు సమీపంలో ఒక ఎకరా స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం, ఆ స్థలం విలువ సుమారు రూ. 10 కోట్లకు పైగా పలుకుతుంది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి మానుగుంట మహేందర్ రెడ్డితో పాటుగా, అప్పటి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కార్యాలయ నిర్మాణం కోసం శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించారు. అయితే పనులు ప్రారంభం అవుతాయనే లోగా టీడీపీ ప్రభుత్వం మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పురోగతిలేదు. కార్యాలయ నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ స్థలంలో పిచ్చి మొక్కలు వెలిశాయి.
మున్సిపల్ కార్యాలయం కోసం సేకరించిన స్థలంపై అధికార వైసీపీ నేతల కన్నుపడింది. ఇదే అదునుగా రాత్రికి రాత్రే, భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆ శిలాఫలకం ఆనవాళ్లు లేకుండా పూర్తిగా చదును చేశారు. అనంతరం ఎకరా ప్రభుత్వ స్థలాన్ని చదును చేశారు. ఆ ప్రదేశంలో ఉన్న పిచ్చిమెుక్కలను ట్రాక్టర్‌తో చదును చేసి పంచుకోవడానికి సిద్ధమయ్యారు.
కనిగిరిలో వాలంటీర్లకు తాయిలాలు - జగన్ చిత్రంతో ఉన్న సంచిలో గిఫ్టులు