ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకేరోజు 13,326 గ్రామసభలు - గుర్తించిన ప్రపంచ రికార్డు యూనియన్ - World Record in Holding Gram Sabhas

World Record in Holding Gram Sabhas in AP : రాష్ట్రంలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలను కూటమి ప్రభుత్వం నిర్వహించింది. ఈ విషయాన్ని వరల్డ్‌ రికార్డ్స్‌ యూనియన్‌ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధ్రువపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు అందజేశారు. పంచాయతీరాజ్‌ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదు అవడం గమనార్హం.

WORLD RECORD IN HOLDING GRAM SABHAS
WORLD RECORD IN HOLDING GRAM SABHAS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 2:06 PM IST

World Record in Holding Gram Sabhas in AP : ఏపీలో ఆగస్ట్ 23న పెద్దయెత్తున నిర్వహించిన గ్రామ సభలు రికార్డు సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13 వేల 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించటాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. దీనికి సంబంధించిన రికార్డు పత్రాన్ని, పతకాన్ని యూనియన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు.

ఒకేరోజు 13,326 గ్రామసభలు - గుర్తించిన ప్రపంచ రికార్డు యూనియన్ (ETV Bharat)

పవన్‌ కల్యాణ్‌తో హైదరాబాద్‌లో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ భేటీ అయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజున ఇన్ని సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది.

గ్రామాలకు మళ్లీ మంచిరోజులు - ఐదేళ్ల తర్వాత పండగ వాతావరణం - good days for ap grama panchayats

కేంద్రం ఇచ్చిన నిధులను పక్కకు మళ్లిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పల్లె ప్రగతిని నీరుగార్చింది. చివరికి పంచాయతీ ఖాతాలన్నీ ఖాళీ చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చింది. చివరికి బ్లీచింగ్‌ కూడా కొనలేని స్థితికి తీసుకొచ్చింది. దీంతో గ్రామాలను అపరిశుభ్రత ముంచెత్తుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వర్ణ గ్రామ పంచాయతీ (Swarna Grama Panchayat Program) పేరుతో ‘వందరోజుల ప్రణాళిక’ను రూపొందించింది.

గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు - కూటమి సర్కార్​ అజెండా ఏంటి? - AP Govt Towards Village Development

గ్రామసభల్లో భూ సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం - కేబినెట్​ భేటీలో నిర్ణయం - AP Cabinet Decisions

ABOUT THE AUTHOR

...view details