WOMENS DAY 2024 :బహుళజాతి సంస్థలో లక్షల వేతనంతో ఉద్యోగం వచ్చినా కాదనుకుంది నిహంత్రి. చిన్నప్పటి నుంచీ ప్రాణప్రదంగా అభ్యసించిన నాట్యమే జీవిత గమ్యంగా భావించింది. కూచిపూడిని భావితరానికి అందించడమే ధ్యేయంగా చేసుకుంది. వందలాది చిన్నారులకు నృత్య పాఠాలు బోధిస్తూనే... ఇటీవలే సినీనటిగానూ ప్రస్థానం మొదలుపెట్టింది ఈ హైదరాబాదీ.
Love At 65 Telugu Movie Actress Nihanthri : స్వామి రారా అంటూ కళ్లు, ముఖకవళికలతోనే అద్భుత హావభావాలు పలికిస్తున్న ఈ యువతి పేరు నిహంత్రి రెడ్డి. హైదరాబాద్‌కి చెందిన నిహంత్రి ఐదేళ్ల ప్రాయంలో ఉండగా కూచిపూడి నృత్య అకాడమీలో అడుగుపెట్టింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి కూచిపూడిలో మాస్టర్స్‌తో పాటుబీబీఏ పూర్తిచేసింది. తండ్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేసే సమయంలో తొలిసారి నృత్యప్రదర్శన ఇచ్చింది.
Kuchipudi Dancer Nihanthri Reddy : ఊహ కూడా సరిగా తెలియని వయసులోనే నాట్యాన్ని అభ్యసించడం ఆరంభించిన నిహంత్రితన 16వ ఏట హైదరాబాద్ రవీంద్రభారతిలో కూచిపూడిలో అరంగేట్ర ప్రదర్శన చేసింది. ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూడలేదు. ప్రముఖ నృత్యకారిణి శోభానాయుడు వద్ద కొంతకాలం శిక్షణ తీసుకుని నృత్యంలో మరిన్ని మెళకువలు నేర్చుకుంది.
Kuchipudi Dancer Chandana Warangal: పదిహేనేళ్లకే 250 ప్రదర్శనలు.. 20కి పైగా బిరుదులు
దేశవిదేశాల్లో కలిపి ఇప్పటి వరకు దాదాపు వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది నిహంత్రి రెడ్డి (Hyderabad Kuchipudi Dancer Nihanthri Reddy) . సంగీతంతో పాటు తబలా, వీణాలాంటి వాయిద్యాలపైనా పట్టు సాధించింది. కళల్లోనే కాక షూటర్‌గానూ సత్తా చాటి బహుముఖ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఓ బహుళజాతి సంస్థలో లక్షల వేతనంతో కొలువు వచ్చినా వదులుకుని కూచిపూడి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటంపైనే దృష్టిసారించింది.