Women Rape Cases in Telangana :మహిళలపై అత్యాచారాలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. మరోవైపు ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో మూడొంతుల మంది నిర్దోషులుగా విడుదలవుతున్నారు. హీనమైన ఈ నేరాల్లో శిక్షలు అరకొరగా ఉంటుండడంపై సర్వాత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనపై దేశం అట్టుడుకుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆయా కేసులపై పరిశీలన కథనం.
- జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2022 సంవత్సరంలో 2,293, 2023లో 2,284 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.
- తెలంగాణలో 2022లో కోర్టుల్లో విచారణ పూర్తయినవి కేసులు 609.
అత్యాచారం కేసుల్లో శిక్షలు పడగా 4,486 కేసులను కొట్టేశారు. మహిళలపై నేరాలను అరికట్టడానికి రాష్ట్రంలో చేపట్టిన అనేక చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నప్పటికి అత్యాచార నిందితులకు శిక్షల విషయంలో పరిస్థితి పేలవంగా ఉందని ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి.
- 2023లో రాష్ట్రంలో నమోదైన అత్యాచారం కేసుల్లో 69.18 శాతం మంది పెళ్లి చేసుకుంటామని మభ్యపెట్టి లైంగిక చర్యకు పాల్పడ్డవారే.
- 13.44 శాతం కేసుల్లో ఇంటి చుట్టుపక్కల ఉండేవారు.
- 6.44 శాతం కేసుల్లో బంధువులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
- 0.26 శాతం కేసుల్లో బాధితులకు పూర్వ పరిచయం లేనివారు ఈ దురాగతానికి ఒడిగట్టారు.
- 10.68 శాతం కేసుల్లో ఇతరులు నిందితులుగా ఉన్నారు.
ప్రస్తుతం కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం, గతంలో హైదరాబాద్‌లో ‘దిశ’ ఉదంతం, అంతకుముందు దిల్లీలో ‘నిర్భయ’ వంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు, ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలు చేపట్టడం షరామాములైంది. నిర్భయ ఘటన తర్వాత మహిళలపై నేరాలకు సంబంధించిన చట్టాలను సంస్కరించారు. నిర్భయ ఫండ్ పేరిట అన్ని రాష్ట్రాలకు పత్యేకంగా నిధులిస్తున్నారు.
సిద్దిపేటలో దారుణం - ఆడిస్తానని తీసుకెళ్లి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం - Three Year old Girl Raped