తెలంగాణ

telangana

మొబైల్ ఛార్జర్ కోసం హత్య - 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు - Woman Murder Case In Medchal

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 4:44 PM IST

Updated : Aug 26, 2024, 7:11 PM IST

Woman Murder Case In Medchal : ఓ మొబైల్ ఛార్జర్ కోసం మొదలైన గొడవ చివరకు మహిళ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 23న ఈ ఘటన చోటుచేసుకోగా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, 24 గంటల్లోనే నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

Woman Murder Case
Woman Murder Case In Medchal (ETV Bharat)

Woman Murder Case In Medchal: సెల్​ఫోన్ ఛార్జర్ కోసం జరిగిన చిన్న పాటి గొడవ మహిళ హత్యకు దారి చేసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఈ నెల 23న దుండిగల్ తండాలో శాంతి అనే మహిళను హత్య చేసిన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. మహిళను హత్య చేసిన సూపర్​వైజర్ కమల్ కుమార్​ అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరిలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ జిల్లా డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దుండిగల్ తండా-2కు చెందిన జె.శాంతి (45) బెల్ట్​ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు ఒక కుమార్తె. భర్త ఇది వరకే చనిపోగా ఒంటరిగా ఉంటోంది. వరంగల్ జిల్లాకు చెందిన రావుల కమల్ కుమార్ (37) ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సూపర్​ వైజర్​గా పని చేస్తూ ఆమె ఇంటి పక్కనే నెల రోజులుగా అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 23న తన మొబైల్ ఛార్జర్ పోయిందంటూ, నీవు తీసావా అంటూ శాంతితో గొడవపడ్డాడు. ఛార్జర్ విషయంలో శాంతి ఛార్జర్ లేదంటూ వాగ్వాదానికి దిగింది. మృతురాలు శాంతి అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో నిందితుడు కమల్ కుమార్ విచక్షణారహితంగా శాంతిపై దాడి చేశాడు.

మద్యం మత్తులో ఆమెను బలంగా తోయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దాంతో ఆమె అరవడంతో నోరు, ముక్కు మూయడంతో ఊపిరాడక చనిపోయింది. అనంతరం నిందితుడు సొంతూరుకు పారిపోయాడు. ఈ మేరకు ఈ నెల 24న మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ నెల 25న గాగిల్లాపూర్​లో కమల్ కుమార్​ను అరెస్ట్ చేశారు. విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు డీసీపీ స్పష్టం చేశారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

"దుండిగల్ పరిధిలో శాంతి అనే మహిళ బెల్ట్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగించేది. ఇటీవల శాంతి వద్దకు కమల్ కుమార్ అనే యువకుడు వచ్చాడు. మొబైల్ ఛార్జర్ ఇవ్వాలని శాంతితో గొడవపడి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకొని 24 గంటల్లో నిందితున్ని అరెస్ట్ చేశాం." - కోటిరెడ్డి, డీసీపీ మేడ్చల్

బాలాపూర్​లో బీటెక్ స్టూడెంట్ దారుణ హత్య - నిందితుల కోసం పోలీసుల గాలింపు - Balapur Engineering Student Murder

బాలాపూర్‌ రౌడీషీటర్ హత్య కేసును చేధించిన పోలీసులు - తొమ్మిది మంది అరెస్టు - Balapur Rowdy Murder Case

Last Updated : Aug 26, 2024, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details