ETV Bharat / entertainment

ఆ మూవీ షూటింగ్​లో వాళ్లను గన్​తో బెదిరించిన చిరు! - అసలు అప్పుడేం జరిగిందంటే? - Chiru Threatened with Real Gun - CHIRU THREATENED WITH REAL GUN

Chiranjeevi Suhasini : మెగాస్టార్​ చిరంజీవి ఓ మూవీ షూటింగ్ సమయంలో తమను వెంబడించిన గుంపును రియల్​ గన్​తో బెదిరించి పారిపోయేలా చేశారట. అసలు ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందంటే?

source ETV Bharat
Chiranjeevi (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 9:03 AM IST

Updated : Sep 18, 2024, 9:13 AM IST

Chiranjeevi Suhasini : చిత్ర పరిశ్రమలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ జాబితాను తిరగేస్తే అందులో చిరంజీవి-సుహాసిని పేరు కచ్చితంగా ఉంటుంది. వీరిద్దరు 1980 - 1990ల్లో పలు సినిమాలలో కలిసి నటించారు. ఇప్పటికీ వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో సినిమాల్లోని సాంగ్స్​ సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ అవుతూ ఉంటాయి. అంతలా ఆకట్టుకుందీ జంట.

అయితే చిరంజీవిపై సుహాసిని ప్రశంసలు కురిపించిన పాత వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులో చిరుతో సుహాసిని వీడియో కాల్‌లో మాట్లాడుతూ కనిపించారు. ఈ సందర్భంగా గతంలో తమ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేశారు.

"మెగాస్టార్​ చిరంజీవి నా హీరో. అందరికీ ఓ విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఓ సారి చిత్రీకరణ కోసం కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్లాము. అక్కడు ముందు కారులో చిరంజీవి వెళ్తుండగా, వెనక కారులో నేను, డ్యాన్స్‌ మాస్టర్, హెయిర్‌ డ్రెస్సర్‌ వెళ్లాం. అయితే అనుకోకుండా కొంతమంది తాగుబోతులు మా కారును వెంబడించి, కారుపై బీరు సీసాలను విసిరారు. ఇది చూసిన చిరు వెంటనే తన కారు దిగి వాళ్లను గన్‌తో బెదిరించి పారిపోయేలా చేశారు. హీరోయిజం అంటే కెమెరా ముందే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ అలానే ఉండాలి" అంటూ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు.

ఈ సంఘటన మీకు గుర్తుందా అని చిరంజీవిని సుహాసిని అడగగా, 'గుర్తుంది. కానీ వాళ్లను మిమ్మల్ని వెంబడించడం అనేది అనూహ్య పరిణామం' అని చిరంజీవి బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను మెగాస్టార్ ఫ్యాన్స్​ తెగ షేర్‌ చేస్తున్నారు.

కాగా, చిరంజీవి - సుహాసిని కలిగి తొలిసారి మగమహారాజు చిత్రంలో కలిసి నటించారు. అనంతరం ఛాలెంజ్‌, చంటబ్బాయ్‌, రాక్షసుడు, మంచిదొంగ, ఆరాధన వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర(Chiranjeevi Viswambara Movie) అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

దసరా బరిలో ఐదు చిత్రాలు - సినీప్రియుల చూపంతా ఆ సినిమాపైనే! - Tollywood Box Office Dasara 2024

పోలీస్‌ బెల్టుతో నాన్న చితకబాదారు!: రామ్ చరణ్ - Chiranjeevi Ramcharan

Last Updated : Sep 18, 2024, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.