ETV Bharat / state

ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సన్నాహాలు - 8 వేల ఎకరాల భూసేకరణ - Land Acquisition for Future City

Congress Govt Focus On Future City : అవకాశాల గమ్యస్థానం హైదరాబాద్ మహానగరానికి అనుబంధంగా మరో నూతన​ నగరం నిర్మాణం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా, రేవంత్​ సర్కార్​ తెరపైకి తీసుకొచ్చిన ఈ ఫ్యూచర్‌ సిటీకి కావలసిన గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

CM Revanth On Future City Development
Green Field Road For Future City (eenadu.net)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 8:09 AM IST

Land Acquisition for Future City Green Field Road : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా గ్రీన్​ఫీల్డ్‌ రహదారిని నిర్మించాలని సంకల్పించింది. ఫ్యూచర్‌ సిటీలో స్కిల్‌ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, ఇండస్ట్రీస్​ కొలువుదీరనున్న నేపథ్యంలో ఈ రహదారి ఏర్పాటుకు నిర్ణయించారు. హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధికి ఫ్యూచర్‌ సిటీ కీలకంగా మారుతుందని రేవంత్​ సర్కార్​ విశ్వసిస్తోంది.

ఈ క్రమంలో నగర విస్తరణ కూడా ఇటువైపే ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భావి ప్రణాళికలు, ట్రాఫిక్‌ అవసరాలను అనుగుణంగా రోడ్ల అనుసంధానం కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్‌ సిటీకి మెరుగైన అనుసంధానత కోసం ప్రస్తుత ఔటర్​ రింగ్​ రోడ్ (ఓఆర్‌ఆర్‌) నుంచి శ్రీశైలం నేషనల్​ హైవే వరకు 40 కిలోమీటర్ల పొడవునా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-13 రావిర్యాల నుంచి కందుకూరులోని మీర్‌ఖాన్‌పేటను ఈ దారి కలుపుతుంది. ఫ్యూచర్​లో మీర్‌ఖాన్‌పేట నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) వరకు అనుసంధానించనున్నారు.

  • మహేశ్వరం మండలంలోని కొంగర ఖుర్ద్, ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల, దండుమైలారం, ఇబ్రహీంపట్నం ఖాల్సా, కప్పపహాడ్, నారేపల్లి, హఫీజ్‌పూర్, మజీద్‌పూర్, ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్, కందుకూరు మండలంలోని గూడూరు, గుమ్మడవెల్లి, లేమూర్, మదాపూర్, రాచలూర్, తిమ్మాయిపల్లి, తుమ్మలూర్, మంఖాల్, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాల పరిధిలో 7622.19 ఎకరాల్లో వివిధ రకాల భూములు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎక్కువ విస్తీర్ణంలో సర్కార్​ భూములు ఉన్నట్లు తేల్చారు.
  • రహదారి నిర్మాణంతో పాటు సమీపంలో భూముల అభివృద్ధిని కూడా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. మహేశ్వరం మండలంలో ఒక గ్రామం, కందుకూరు మండలంలో ఆరు, ఇబ్రహీంపట్నం మండలంలో రెండు గ్రామాల్లో మొత్తంగా 497 ఎకరాల విస్తీర్ణంలో భూ సేకరణకు రూ.175.87 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు.
  • ఇబ్రహీంపట్నం మండలంలో తెలంగాణ స్టేట్​ ఇండస్ట్రియల్​ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్మెంట్​ కార్పొరేషన్​కు చెందిన 834.17 ఎకరాలు విస్తీర్ణంలో భూములు ఉన్నాయి. కందుకూరు, మహేశ్వరం మండలాల్లో సుమారు 742 ఎకరాల్లో భూగర్భ గనులు, ఖనిజాల శాఖ, అటవీశాఖకు చెందిన భూములున్నాయి.
  • గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి సంబంధించి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్​ డెవలప్మెంట్​ అథారిటీ​​ (హెచ్‌ఎండీఏ) ఇప్పటికే రోడ్‌ ఎలైన్‌మెంట్‌ను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు సమాచారం.

8 వేల ఎకరాల భూ సేకరణ : ఔటర్​ రింగ్​ రోడ్​ ఎగ్జిట్‌-12 రావిర్యాల నుంచి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాలద్వారా ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్‌ వెళ్తుంది. దీనికి దాదాపు ఎనిమిది వేల ఎకరాల భూములు అవసరమని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది.

రోడ్డు వెళ్లనున్న మండలాలు-గ్రామాల సంఖ్య :

  • మహేశ్వరం - 2
  • కందుకూరు - 10
  • ఇబ్రహీంపట్నం - 9

ఫ్యూచర్‌ సిటీపై రేవంత్ ఫోకస్‌ - 'మెట్రో మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయండి' - CM REVANTH ON FUTURE CITY

రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా మార్చడమే మా లక్ష్యం - సీఎం రేవంత్​ - CM REVANTH INAGURATES COGNIZANT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.