ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"మాజీమంత్రి సుచరిత మరిది వేధిస్తున్నారు" - కలెక్టర్‌కు మహిళ ఫిర్యాదు - COMPLAINT ON EX MINISTER RELATIVE - COMPLAINT ON EX MINISTER RELATIVE

Woman Complaint on Former Minister Mekathoti Sucharita Relative: గత ప్రభుత్వ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత మరిది తమ స్థలాన్ని అద్దెకు తీసుకుని బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ వాపోయారు. అధికారులు యంత్రాంగం స్పందించి తమ స్థలం ఇప్పించాలని ఆమె కోరుతున్నారు.

complaint_on_ex_minister_relative
complaint_on_ex_minister_relative (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 4:46 PM IST

Updated : Sep 30, 2024, 5:12 PM IST

Woman Complaint on Former Minister Mekathoti Sucharita Relative:మాజీ మంత్రి మేకతోటి సుచరిత మరిది మేకతోటి వెంకటప్పయ్య తమ స్థలాన్ని అద్దెకు తీసుకుని బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ వాపోయారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరులోని విజయపురి కాలనీకి చెందిన చెట్టి జ్యోతిలక్ష్మి మాజీ మంత్రి మేకతోటి సుచరిత మరిది డిప్యూటీ డీఈవో మేకతోటి వెంకటప్పయ్య వాసవీనగర్‌లోని స్థలాన్ని 2019లో 500 గజాల స్థలం అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఖాళీ చేయమని పోలీసులను ఆశ్రయిస్తే 2 నెలల్లో ఖాళీ చేస్తానని చెప్పి నేటికీ చేయకుండా తమపైనే కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. ప్రశ్నించిన తన భర్త, కుటుంబసభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టారని అన్నారు.

అద్దె చెల్లింపులను వేర్వేరు పేర్లతో చెల్లిస్తున్నారని అతని పలుకుబడిని ఉపయోగించుకుని కరెంట్‌ బిల్లును అతని పేరుతో మార్పించుకుని ఇప్పుడు స్థలం వైపు రావద్దంటూ బెదిరిస్తున్నారని జ్యోతిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే మేకతోటి సుచరితకు చెప్పినా కూడా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. భర్త సంవత్సరాలుగా మంచం పట్టి ఈ ఏడాది చనిపోయారని కుమారుడిని డాక్టర్‌ చదివించాలనుకుంటే ఉన్న స్థలం ఇలా ఆక్రమించి బెదిరిస్తున్నారని జ్యోతిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు యంత్రాంగం స్పందించి తమ స్థలం ఇప్పించాలని జ్యోతిలక్ష్మి కోరుతున్నారు.

"మాజీమంత్రి సుచరిత మరిది వేధిస్తున్నారు" - కలెక్టర్‌కు మహిళ ఫిర్యాదు (ETV Bharat)

మాజీ మంత్రి మేకతోటి సుచరిత మరిది డిప్యూటీ డీఈవో మేకతోటి వెంకటప్పయ్య మా స్థలాన్ని అద్దెకు తీసుకుని ఐదేళ్లుగా ఖాళీ చేయకుండా బెదిరిస్తున్నారు. 2019లో తమ స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఖాళీ చేయమని ఎస్పీకి ఫిర్యాదు చేశాను. అప్పుడు రెండు నెలల్లో ఖాళీ చేస్తానని చెప్పారు. కాని ఇప్పటికీ ఖాళీ చేయకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారు. అంతే కాకుండా మాపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారు. అతనిని ప్రశ్నించిన నా భర్త, కుటుంబసభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టారు. ఈ విషయం సుచరిత దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదు. దొంగపత్రాలతో తమ స్థలం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.- చెట్టి జ్యోతిలక్ష్మీ, బాధితురాలు

ఏలూరులో కాల్​మనీ ఆగడాలు - మంగళవారం వచ్చిదంటే బాధితులకు వణుకు - Call Money Harassment in Eluru

టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకర్ల నోటీసులు- 'ఇళ్లు ఇవ్వకుండా వాయిదా ఎలా కట్టాలి?' - TIDCO Beneficiaries Facing Problems

Last Updated : Sep 30, 2024, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details