Telangana Weather Report Today : గత కొన్నిరోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారుతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో గంటకు 30నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఈరోజు నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్ గుండా వెళ్తున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4 రోజులలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని సంచాలకులు వివరించారు. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం నేటి ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వివరించారు.
రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు - రేపటి నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు - rains in Telangana from Tomorrow
Heavy Rains in Telangana 2024 : అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి ఒక్కసారిగా కుండపోత వర్షాలు సంభవిస్తుంటాయి. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు లేనప్పటికీ ఏప్రిల్‌లో నమోదైన రికార్డు స్థాయి ఎండలు ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం గరిష్ఠంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సానుకూల పరిస్థితులు ఏర్పడటంతో, ఒకదాని వెంట ఒకటి ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి.
GHMC Teams Alert on Heavy Rains :మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. పట్టణ వాసులు వానలు పడుతున్న సమయంలో అత్యవసరం అయితే బయటకు రావొద్దని సూచించారు. వాహనదారులు రోడ్లపై భారీగా నీళ్లు చేరడంతో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో సమస్యలపై సంప్రదించేందుకు 040 21111111, 9000113667 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు - రాగల మూడ్రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - SOUTH WEST MONSOON HITS TELANGANA
రెండ్రోజుల్లో తెలంగాణకు 'నైరుతి' - రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు వర్షాలు - TELANGANA RAINS ALERT TODAY