Water Cut in Some Areas Of Hyderabad Today :హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-3లో లీకేజీ కారణంగా గురువారం నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది. 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు లీకేజీ ఏర్పడడంతో మరమ్మతు పనులు చేస్తున్నట్లు తెలిపింది. అందువల్ల గురువారం (అక్టోబర్ 24వ తేదీ) ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని జలమండలి ఎంజీ అశోక్ రెడ్డి వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఆ ఏరియాల్లో ఇవాళ నీటి సరఫరాకు అంతరాయం - WATER CUT IN SOME AREAS HYDERABAD
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం - మరమ్మతుల కారణంగా ఆటంకం- ప్రకటించిన జలమండలి
Published : Oct 24, 2024, 7:07 AM IST
ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం :శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్ పేట్, ఆళ్లబండ, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, లాలాపేట్, సాహేబ్ నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవి రిజర్వాయర్లు, సైనిక్ పురి, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్ర నగర్, మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్‌నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్ పూర్, గంధంగూడ, బోడుప్పల్, మల్లిఖార్జున నగర్, మాణిక్‌చంద్, చెంగిచెర్ల, భరత్‌నగర్, ఫిర్జాదిగూడ, పెద్ద అంబర్‌పేట్, శంషాబాద్ ధర్మసాయి ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది.
భాగ్యనగరంలోని ఆ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
Free Drinking Water Supply Hyderabad : ఉచితంగా ఇస్తామన్నా.. ఉలుకూపలుకూ లేదు!