తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవిలో అద్భుతం - చెట్టు నుంచి ఉబికి వస్తున్న జలధార - Water From Tree In Alluri District - WATER FROM TREE IN ALLURI DISTRICT

Water From Tree in Alluri District : సాధారణంగా నేల నుంచి నీళ్లు ఉబికి రావడం అందరికీ తెలిసిన విషయమే. కానీ చెట్టులోంచి నీళ్లు ధారాళంగా వస్తున్నాయి. చెట్టు కాయలు, పండ్లు అందిస్తుందని తెలుసు కానీ, నీరు ఇవ్వడమేంటి అనుకుంటున్నారా ? వినడానికి వింతగా ఉన్నా, ఇది నిజమేనండి. ఇంతకీ దీని కథేంటో చూసేయండి మీరే!

Water Coming From Tree Video Viral
Water From Tree in Alluri District

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 4:54 PM IST

అడవిలో అద్భుతం- చెట్టు నుంచి ఉబికి వస్తున్న జలధార

Water From Tree in Alluri District : సాధారణంగా భూమిలో బోరు వేస్తే నీళ్లు ఉబికి వస్తాయి. కానీ చెట్టును నరికితే నీళ్లు ఉబికి రావడాన్ని ఎప్పుడైనా చూశారా. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా, మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని​ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ అరుదైన సన్నివేశం కనిపించింది. ఒక చెట్టు మొదలు భాగం నరుకుతుండగా, ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చింది. పాపికొండల నేషనల్ ఫారెస్ట్ పరిధిలోని (National Forest Range) కింటుకూరు ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ శాఖ అధికారుల పరిశీలనలో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.

అక్కడ నల్ల మద్ది చెట్టు నుంచి నీళ్లు చుక్కలు, చుక్కలుగా రావడాన్ని గమనించిన అధికారులు, వెంటనే చెట్టు బెరుడును నరకగా, మొదలు భాగం నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. అలా వచ్చిన జలధార చూసిన ఫారెస్ట్​ అధికారులు అవాక్కయ్యారు. ఆ చెట్టు నుంచి దాదాపు ఇరవై లీటర్ల వరకు నీరు వస్తుందని చెబుతున్నారు. చెట్టు నుంచి వచ్చిన నీళ్లను అటవీ శాఖ అధికారులు తాగారు. ఈ చెట్టును జలధార వృక్షంగా వారు చెబుతున్నారు.

Water Coming From Tree Viral Video : ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అల్లూరి జిల్లా రంపచోడవరం - కింటుకూరు అటవీ ప్రాంతంలో నల్ల మద్ది చెట్లు వేలాదిగా ఉన్నాయి. కొన్నింటిలోనే నీటిని నిలువ చేసుకునే వ్యవస్థ ఉంది. నల్ల మద్ది చెట్టు 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు నిల్వ చేసుకుంటుంది. గోదావరీ నదీ (Godavari River) పరివాహక ప్రాంతాల్లోనూ అటవీ ప్రాంతంలో విరివిగా ఈ నల్ల మద్ది చెట్లు ఉన్నాయి. వందల్లో ఒక చెట్టుకు మాత్రమే నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ముషీరాబాద్‌లో హోటల్ వద్ద యువకుల మధ్య ఘర్షణ - వీడియో వైరల్ - Street Fight In Hyderabad

కరెన్సీ నోట్లపై అవినీతి నేత నిద్ర!- సోషల్ మీడియాలో ఫొటో వైరల్- విషయం ఏంటంటే? - Politician Sleeping On Currency

ABOUT THE AUTHOR

...view details