ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థి త్రయం వినూత్న ఆవిష్కరణ- ఆస్పత్రుల్లో హైబ్రిడ్ మెడికల్ బెడ్ - Hybrid Medical Bed Mattress

Hybrid Medical Bed Mattress: కరోనా భయం వైద్యులను సైతం వణికించింది. వైరస్​ వ్యాప్తి దృష్ట్యా రోగులకు వైద్యం అందించడానికి వైద్యులు ప్రాణాలకు సైతం తెగించాల్సి వచ్చింది. ఇలాంటి దృశ్యాలు కానూరు వి.ఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల మనస్సును కదిలించాయి. దీంతో వైద్యులకు, రోగికి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందేలా వినూత్న ఆలోచన చేశారు. మరి, ఆ ఆవిష్కరణ ఏంటి? ఎలా పని చేస్తుందో ఈ కథనంలో చూద్దాం.

Hybrid_Medical_Bed_Mattress
Hybrid_Medical_Bed_Mattress (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 6:09 PM IST

Hybrid Medical Bed Mattress:అధునాతన సాంకేతికను జోడించి హైబ్రిడ్ మెడికల్ బెడ్​ను అందరిని అబ్బురపరస్తున్నారు కానూరు విఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల్లో ఈఈఈ చదువుతున్న విద్యార్థులు. రెహన్, సందీప్, సాయిరాం కృష్ణ ఒక బృందంగా ఏర్పడి తమ మేధస్సుకు పదును పెట్టి ఈ బెడ్​ను రుపొందించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను స్ట్రేచర్​పై తీసుకువెళ్తుంటారు. వైద్య సేవలు అందించేందుకు ఒక గది నుంచి మరొక గదికి మార్చుతుంటారు. ఇలా మార్చే క్రమంలో గాయాలపాలైన వారి శరీర భాగాలు ఎక్కువగా కదలడంతో నొప్పి ఎక్కువై నరకం చూడాల్సి వస్తోంది. ఆ ఇబ్బందులను దూరం చేసేందుకు విద్యార్థులు ఈ మెడికల్ బెడ్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ బెడ్​లో స్ట్రచ్చర్ పార్ట్, విల్ చైర్ పార్ట్, స్టేషనరీ పార్ట్ అనే మూడు విభాగాలు పొందుపరిచారు. ప్రస్తుతం పెద్ద హస్పిటల్స్​లో ఉన్న బెడ్స్​ను కూడా వీల్ చైర్​లో మార్చుకునే సౌకర్యం ఉంది కాకపోతే వాటిని చేతితో తిప్పాలి, కానీ ఈ విద్యార్థులు రుపొందించిన బెడ్​లో మొబైల్ ద్వారా స్ట్రచ్చర్, వీల్ చైర్, స్టేషనరీ పార్ట్స్​గా మార్చుకునే సౌకర్యాన్ని పొందుపరిచారు. స్ట్రచ్చర్ పార్ట్​లో రోగిని ఎత్తకుండా అంబులెన్స్ నుంచి ఐసియూ వరకు తీసుకు వెళ్లవచ్చని విద్యార్థులు అంటున్నారు. అలాగే వీల్ చైర్ పార్ట్​ను మొబైల్ ద్వారా కన్వెట్ చేసుకోవచ్చని అన్నారు.

రోగి అవసరాలకు అనుగుణంగా స్టేషనరీ పార్ట్​ను కూడా అభివృద్ధి చేశామని, దీనిలో రోగికి పెట్టే సెలైన్ ఆటో మిషన్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ బెడ్​లో హెల్త్ సెన్సార్స్ కూడా విద్యార్థులు అమర్చారు. ఈ సెన్సార్ ద్వారా 15 నిమిషాలకు ఒకసారి రోగి స్థితిగతులు తెలుసుకునే అవకాశం ఉందని విద్యార్థులు అంటున్నారు. బెడ్​పై ఉన్న రోగి శరీర ఉష్ణోగ్రత, రక్తపొటు, గుండె వేగం, రోగి ఉన్న గది ఉష్ణోగ్రత తదితర వివరాలను తెలుసుకొవచ్చని తెలిపారు. 15 నిమిషాలకు ఒకసారి రోగి ఆరోగ్య వివరాలు కంట్రోల్ ప్యానల్​కు అందిస్తుందని, అక్కడి నుంచి డాక్టర్ తెలుసుకొవచ్చని చెప్పారు.

అమెరికాలో ఉంటున్నా మనసంతా సొంతూరిపైనే- గ్రామానికి సేవలు అందిస్తోన్న యువ ఇంజినీర్ - SIVAKRISHNA CHARITABLE TRUST

ముందుగా కార్పొరేట్ హస్పిటల్స్ ఉన్న ఐసియూ బెడ్స్​ను పరిశీలించామని, వాటి కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఈ ప్రాజెక్టును రుపొందించామని విద్యార్థులు అంటున్నారు. చాలామంది ఇళ్లలో వైఫై సౌకర్యం ఉండకపొవచ్చని, అందుకే బెడ్​కు అనుసంధానంగా వైఫై సౌకర్యంతో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి 15 నిమిషాలకు బెడ్ ద్వారా వచ్చే సమాచారంతో వైద్యులు తమ గది నుంచే రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వెసులుబాటును కల్పించామన్నారు.

సాధారణ బెడ్​లతో అయితే రోగిని ఇతర గదికి తీసుకువెళ్లాలంటే నర్సుకు ఎవరో ఒకరి సహయం కావాల్సి వస్తుందని, తాము రుపొందిన బెడ్​తో అయితే వీల్ చైర్​గా మార్చుకుని ఎవరి సహయం లేకుండా నర్సు ఒక్కరే రోగిని ఎక్కడి కావాలంటే అక్కడికి తీసుకు వెళ్లవచ్చని చెప్పారు. రోగికి ఏదైనా వైద్య అవసరం ఏర్పాడితే ఆ వ్యర్థాల కోసం ప్రత్యేకంగా ఈ బెడ్​ లోనే శానిటరీ పార్ట్ కూడా సిద్దం చేశామన్నారు. ఒకరి సహయంపై ఆధారపడాటానికి ఇష్టపడని వారికి ఈ బెడ్ ఎంతగానో ఉపయోపడుతుందన్నారు.

సాధారణంగా అయితే రాత్రి సమయాల్లో నైట్ వైద్యులు, సిబ్బంది రోగి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉంటారు. సాయంత్రం సమయంలో రోగులను పరిక్షించి వెళ్లిపోతారు. ఒక వేళ రాత్రి సమయంలో రోగికి ఎదైనా అత్యవసరం అయితే బెడ్​లో ఉండే సెన్సార్ ప్రతి 15 నిమిషాలకు ఇచ్చే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. వైద్యులు ఆ సమాచారాన్ని పరిక్షిస్తే రోగి ఆరోగ్య వివరాలు తెలుస్తాయని చెప్పారు.

కొంతమందికి ఆరోగ్యం ఎంత ఇబ్బంది పెడుతున్నా హస్పిటల్​లో ఉండి చికిత్స పొందేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించరు. అటువంటి వారు ఈ బెడ్​ను వినియోగిస్తూ వైద్య సహయం పొందొచ్చని విద్యార్థులు చెబుతున్నారు. ఈ బెడ్​ను రెండు రకాలుగా మార్కెట్​లోకి తీసుకువద్దామని అనుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. ప్రజలకు సేవలు అందించే విధంగా ఒకటి, ప్రజలకు తమ ప్రొడక్టును అమ్మే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బెడ్​లో ఉన్న వైఫై ఫోన్​తో కనెక్ట్ చేసుకుంటే బెడ్​ను సులభంగా వినియోగించుకోవచ్చని అంటున్నారు.

కార్పొరేట్ హస్పిటల్స్ ఎక్కువ బెడ్​లు తీసుకుంటే ప్రతి బెడ్​కి నియంత్రణ పరికరం అమర్చి, దాని ఐపి అడ్రస్ ద్వారా వైర్ లెస్ కంట్రోల్ లో బెడ్ పై ఉన్న రోగి స్థితిగతులు తెలుసుకోచ్చన్నారు. హస్పిటల్ సిబ్బందికి మాత్రమే కాకుండా రోగి బంధువులకు ఒక యూజర్ నేమ్, పాస్​వర్డ్ ఇస్తామని, దీనిద్వారా రోగి ఆరోగ్యం గురించి తెలుస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఈ బెడ్​కు రోగి కదలికలు తెలుసుకునేందుకు కెమెరా సదుపాయాన్ని కూడా అమర్చుతామన్నారు.

అలాగే రోగి ఏ సమయంలో ఏ మందులు వేసుకోవాలనే అంశాన్ని తెలిపేందుకు సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామన్నారు. దీని ద్వారా రోగి ఆరోగ్య విషయాలు తెలుసుకోవడం వైద్యులకు సులభతరం అవుతుందన్నారు. కళాశాల విద్యార్థులు రుపొందించిన ఈ బెడ్ వైద్య రంగానికి ఎంతో ఉపయోగపడనుంది. తమకు వచ్చిన ఆలోచనను కళాశాల అధ్యాపకులను తెలిపామని, వారు సంపూర్ణ సహకారం అందించడం వల్లే తాము ఈ బెడ్​ను తయారు చేశామని విద్యార్థులు అంటున్నారు.

ఒలంపిక్స్​లో పసిడి పతకమే లక్ష్యం - పవర్‌లిఫ్టింగ్‌లో ​గుంటూరు యువ క్రీడాకారుడు సత్తా - Power Lifter Bharat Kumar

ABOUT THE AUTHOR

...view details