Mentally Disabled Woman Gave Birth To Baby Boy : ఏ ఇంటి ఆడబిడ్డో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికి తెలియదు. 30 నుంచి 35 సంవత్సరాల మహిళ. మానసిక స్థితి సరిగా లేదు. 2 సంవత్సరాలుగా రాజమహేంద్రవరం గ్రామీణం శాటిలైట్‌సిటీలో ఓ ఆలయం వద్ద ఉంటూ యాచన చేసుకుంటుంది. స్థానిక ప్రజలు ఇచ్చిన ఆహారాన్ని తింటూ జీవనం సాగిస్తోంది. ఈ తరుణంలో ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భిణిని అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితి ఆమెది.
తల్లీ బిడ్డ క్షేమం - ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు : శుక్రవారం ఉదయం ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో ఆమె పరుగులు తీసింది. అది గమనించిన వారు ఎవరింటి శిశువునో పట్టుకొని పారిపోతున్నట్లుగా తొలుత భావించారు. అసలు విషయం తెలిసి జాలి పడ్డారు. అనంతరం ఆ శిశువును చేరదీసి పాలు పట్టారు. ఆదే గ్రామానికి చెందిన పలువురు ఆ బిడ్డను పెంచుకోడానికి పోటీ పడ్డారు.
కానీ ఈ విషయం బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎస్‌బీ కానిస్టేబుల్ రామయ్య దృష్టికి వెళ్లడంతో ఆయన ఛైల్డ్ లైన్‌కు సమాచారం ఇచ్చారు. సచివాలయం సిబ్బంది, పోలీసులు సహకారంతో తల్లీ బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరూ క్షేమంగా ఉన్నారు.
లక్ష రూపాయలకు బిడ్డను అమ్మేసింది - 20వేలు తక్కువ కావడంతో గొడవ