ETV Bharat / state

తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం - మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు - AP RAIN UPDATES

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిన వాయుగుండం - పలు జిల్లాలకు పొంచిఉన్న వర్షాలు

rain_updates
AP Rain Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2024, 7:22 AM IST

Updated : Dec 22, 2024, 7:58 AM IST

AP Rain Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలులు దీనికి కారణంగా వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్​కి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం వరకు తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

అయితే, ఇంకా సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

బంగాళాఖాతంలో వాయుగుండం - 24గంటల్లో భారీ వర్షాలు - స్కూళ్లకు సెలవులు

Last Updated : Dec 22, 2024, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.