Vote Counting Process in India :దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ. కట్టుదిట్టమైన భద్రత, అధికారుల సమన్వయంతో ఎంత పకడ్బందీగా నిర్వహిస్తారో, కౌంటింగ్ ప్రక్రియకూ అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రధానంగా లెక్కింపు కోసం ఈసీ నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ ప్రక్రియను ఓసారి పరిశీలిస్తే.
➤ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు 1961లోని ‘రూల్ 54ఏ’ ప్రకారం, పోస్టల్ బ్యాలెట్ పేపర్లను తొలుత లెక్కిస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద వీటిని మొదలు పెడతారు.
➤ పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాతే ఈవీఎంలలోని ఓట్లను కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది.
➤ ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ పేపర్లు లేకుంటే నిర్దేశించిన టైమ్‌కే ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలుపెట్టాలి.
➤ లెక్కిపునకు ఫారం 17సీతోపాటు ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్ (సీయూ) మాత్రమే అవసరం.
➤ సీయూల నుంచి రిజల్ట్‌ను నిర్ధారించే ముందు, పేపర్ సీల్ చెదిరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తరవాత మొత్తం పోలైన ఓట్లను, ఫారం 17సీలో పేర్కొన్న సంఖ్యతో సరిపోవాలి.
➤ కౌంటింగ్ తర్వాత ఆ ఫలితాన్ని తొలుత లెక్కింపు సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాలి.