తెలంగాణ

telangana

ETV Bharat / state

పచ్చని చెట్లు, జంతువుల వద్దకు తీసుకెళ్లి విద్యార్థులకు పాఠాలు - ఈ సారు పాఠం వింటే లైఫ్​లో మర్చిపోరు - HAPPY TEACHERS DAY 2024 - HAPPY TEACHERS DAY 2024

Vikarabad Teacher Got Best Teacher Award : విద్యార్థులకు నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టించకుండా ప్రయోగాత్మకంగా పాఠం నేర్పిస్తే జీవితకాలం ఆ విషయాన్ని మర్చిపోరనే సూత్రాన్ని గ్రహించాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పిల్లలకు వినూత్నంగా విద్యను బోధిస్తూ దిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవానికి ఆహ్వానాన్ని అందుకున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించి వినూత్న పద్ధతిలో బోధన చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Vikarabad Teacher Invited to the Independence Celebrations in Delhi
Vikarabad Teacher Invited to the Independence Celebrations in Delhi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 6:46 AM IST

Vikarabad Teacher Invited to the Independence Celebrations in Delhi :ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం వచ్చేదాకా కష్టపడి చదివి ఒక్కసారి వృత్తిలో చేరాక వృత్తి బాధ్యత నిర్వర్తించడానికే భారంగా భావిస్తుంటారు. విద్యార్థులకు పుస్తకాలలో ఉన్నది చదివి చెప్పటం కాదు ప్రాక్టికల్‌గా నేర్పించాలనుకున్నాడు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. సాధారణంగా తరగతి గదికి వచ్చి పాఠాలు చెప్పి వెళ్లామా అని కాకుండా, విద్యార్థులకు ఏ విధంగా చెప్తే పాఠం అర్థమవుతుందో ఆ విధంగా బోధిస్తున్నారు. అత్వెల్లికి చెందిన లక్ష్మణ్ బయాలజీ టీచర్ కావడంతో చెప్పే ప్రతి మొక్క, జీవి గురించి వాటి దగ్గరకు తీసుకెళ్లి మరి విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో పాఠం చెబున్నారు.

ప్రాక్టికల్​గా పాఠాలు చెప్తున్న టీచర్​కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్టు దిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం (ETV Bharat)

నేటి విద్యార్థులకు వ్యవసాయం అంటే ఏంటో తెలియని పరిస్థితి వారికి ప్రాక్టికల్‌గా సేంద్రీయ వ్యవసాయం నేర్పిస్తేనే వ్యవసాయం అంటే ఏంటో తెలుస్తుందని గ్రహించి పాఠశాల ఆవరణలోనే కూరగాయ పంటలు వేశాడు లక్ష్మణ్‌. అక్కడే మొక్కల గురించి వాటి వ్యవస్థ గురించి వివరిస్తూ పాఠాలు బోధిస్తున్నాడు. అంతే కాదు బడి ఆవరణలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ ద్వారా పండిన పంటనే మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నారు. ఈ వినూత్న ఆలోచనతో పీఎం శ్రీ కింద ఆహ్వానం అందుకున్నారు.

Swarkheda Govt school Headmaster : ఊరిని మార్చిన ఉపాధ్యాయుడు..

"నేను స్కూల్​లో టీచర్​గా అపాయింట్ అయిన తర్వాత పిల్లలు ప్రయోగాత్మకమైన విద్యను బోధించాలి అనుకున్నాను. అందుకే ఇక్కడ ప్రిన్సిపల్​, యాజమాన్యంతో పాఠశాలలో ఉన్న స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశాను. పిల్లలు దగ్గరగా చూపిస్తూ నేర్పించే సబ్జెక్టు బయాలజీ. అందుకే వారికి వ్యవసాయంతో పాటు సేంద్రియ పంటలపై కూడా అవగాహన కల్పిస్తున్నాను. నేను చాలా పేదరికం నుంచి వచ్చాను. అలా వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాల పిల్లల చదువు గురించి తెలుసు. అందుకే నా వంతు సహాయంగా ఇలా వారికి పాఠాలు చేప్తున్నాను. ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్​ నుంచి వచ్చిన కూరగాయలతో పిల్లల మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నాం." - లక్ష్మణ్, ఉపాధ్యాయుడు

తల్లిదండ్రులను కోల్పోయినా తగ్గకుండా :వికారాబాద్ జిల్లా అత్వెల్లికి చెందిన లక్ష్మణ్ రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులో ఇద్దరి తల్లిదండ్రులను కోల్పోయినా వెనుతిరగకుండా తాను చదువుతూ తన ఇద్దరి చెల్లెల్లను చదివించారు. ఆర్థిక పరిస్థితులను అధిగమించటం కోసం పార్ట్ టైం జాబ్స్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం రానంత వరకు నవోదయ స్కూల్​లో బోధించేవారు. ఎంతో కష్టపడి 2019లో సర్కార్‌ ఉద్యోగం సాధించి కొట్‌పల్లి జెట్పీహెచ్​ఎస్​లో ఉపాధ్యాయునిగా చేరారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడమేతన ధ్యేయమంటున్నారు ఉపాధ్యాయుడు లక్ష్మణ్‌.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రకటన, రాష్ట్రం నుంచి ముగ్గురికి

రాష్ట్రంలో 40 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

ABOUT THE AUTHOR

...view details