తెలంగాణ

telangana

ETV Bharat / state

షార్ట్ వీడియోలతో రూ.లక్షల్లో ఆదాయం! - సోషల్​మీడియాలో దూసుకెళ్తున్న బెజవాడ యువత - SOCIAL MEDIA PLATFORM

సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని లక్షల్లో సంపాదన - వీక్షకుల ఆదరణ పొందుతున్న విజయవాడకు చెందిన పలువురు యువత

Social Media platform
Vijayawada Youth On Social Media (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2024, 12:29 PM IST

Updated : Dec 22, 2024, 12:56 PM IST

Vijayawada Youth On Social Media : డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం అవసరం. మంచి జీతంతో కూడిన ఉద్యోగం సంపాదించాలంటే చదువు తప్పనిసరి. కానీ చదువుతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమాల​ను చక్కని వేదికగా చేసుకొని రూ.లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు ఏపీలోని విజయవాడకు చెందిన పలువురు యువత. సందేశాత్మక షార్ట్స్‌తో వీక్షకుల ఆదరణ పొందుతున్నారు. తమ నటనతో మెప్పిస్తూ, లక్షల్లో సబ్​స్క్రైబర్లను సొంతం చేసుకుంటున్నారు. రూ.వేలు, రూ.లక్షలు సంపాదిస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. మహిళలు తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇంట్లోకి అవసరమైన వాటిని తీసుకొని ఆనందంగా గడుపుతున్నారు.

బొజ్జగాని తిరుపతిరావు (ETV Bharat)

మీ కష్టాన్ని నమ్ముకోండి : విజయవాడలోని గన్నవరానికి చెందిన బొజ్జగాని తిరుపతిరావు టాటా ఏస్‌ వాహనం నడపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి సామాజిక మాధ్యమాలపై మంచి పట్టు ఉంది. చాలీచాలని డబ్బుతో అవస్థలు పడే ఈయన, నాలుగేళ్లుగా సందేశాత్మక వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నాడు. దీంతో అతనికి కొంత ఆదాయం వస్తుంది. వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లలను ఇంటర్‌ చదివిస్తున్నారు. ఏ రంగంలోనైనా కష్టపడితే ప్రతిఫలం తప్పకండా వస్తుందని ఆయన తెలుపుతున్నారు.

మానేపల్లి యతీష (ETV Bharat)

సమాజంలో ఉన్నతంగా బతకాలని : విజయ​టాకీస్​ సెంటర్​లో నివసించే యతీష ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెడుతూ పాపులర్ అయ్యారు. భర్త మధు ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో సెల్‌ ఫోన్‌ దుకాణం నడుపుతున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సమాజంలో ఉన్నతంగా బతకాలన్నది ఆమె ఆశయం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. తమ పిల్లలను ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలన్నది ఆమె కోరిక. దీంతో కొత్తగా యూట్యాబ్‌ ఛానల్‌ ప్రారంభించింది. దీంట్లో కామెడీ వీడియోలు చేస్తున్నారు. లక్షల్లో డబ్బులు సంపాదిస్తూ భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా, కొత్తగా ఆలోచించి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యతీష చెబుతున్నారు.

వీరమల్ల జ్యోతి (ETV Bharat)

సందేశాత్మక వీడియోలతో గుర్తింపు : తాడిగడపకు చెందిన వీరమల్ల జ్యోతి రెండు సంవత్సరాల నుంచి రీల్స్‌ చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళలు, ఆడపిల్లల భద్రత, సమాజంలో ఎదురవుతున్న ఇబ్బందులు, మధ్య తరగతి మహిళల పరిస్థితులపై వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఏదో ఒకటి చేయాలన్నది ఆమె ఆశయం. తండ్రి టైలర్‌. చిన్నప్పుడు చదువుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చక్కని వీడియోలు చేస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. భర్త బ్యాంకు ఉద్యోగి. వీరికి ఒక పాప ఉంది.

పల్లెపోగు శ్రుతి (ETV Bharat)

యువతలో మంచి క్రేజ్‌: సత్యనారాయణపురంనకు చెందిన పల్లెపోగు శ్రుతి అనతికాలంలోనే యూత్‌లో మంచి పావులర్‌ అయ్యారు. ఆమె చేసిన వీడియోలకు మంచి ఆదరణ ఉంది. అంతేకాకుండా నగరంలోని పలు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేసేందుకు ఆమెతో ప్రమోషన్‌ చేయించుకుంటున్నాయి. గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా చేసిన వీడియోలు చాలా మంది ఇష్టపడుతున్నారు. ‘ఈమె షరతులు వర్తిస్తాయి’ చిత్రంలో నటించారు. పలు సీరియళ్లలోనూ నటిస్తున్నారు. యువత ఉద్యోగాలపైనే ఆధారపడకుండా సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా బలపడొచ్చని ఆమె చెబుతున్నారు.

మహ్మద్ ఆరిఫ్ (ETV Bharat)

నాన్నే స్ఫూర్తి : బెజవాడ మస్తాన్‌.. మాంసం దుకాణం నడుపుతూ ఖాళీ సమయాల్లో మంచి వీడియోలు చేస్తూ యూట్యాబ్‌లో పాపులర్‌ అయ్యారు. ఆయననే స్ఫూర్తిగా తీసుకొని కుమారుడు రీల్స్‌ చేస్తున్నారు. కామెడీ, సందేశాత్మక షార్ట్స్‌తో యువతను ఆకట్టుకుంటున్నారు. వాటి ద్వారా చిన్ననాటి నుంచే సంపాదిస్తున్నారు. అలాగే వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్‌ వంటివి చేస్తున్నాడు.

యూట్యూబ్ వీడియోలతో ఎంత సంపాదించొచ్చు? రూ.8లక్షలు ఖర్చు చేసినా ఆమె ఎందుకు ఫెయిల్?

చదువు మధ్యలో ఆపేసి.. యూట్యూబ్​ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తోంది! - ఇంతకీ ఏం చేస్తోందో తెలుసా?

Last Updated : Dec 22, 2024, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details