Vehicle Number Plate Rules :మీరు నంబరు ప్లేటు లేకుండా వాహనాన్ని నడుపుతున్నారా? అలాగే నంబరు ప్లేటు ఉన్న దానిపై ఏవైనా రాతలు ఉన్నాయా? మీకు ఇచ్చిన నంబరు ప్లేటు కేంద్ర ప్రభుత్వం మోటారు వెహికిల్స్ చట్టానికి లోబడి లేదా అయితే మీరు జరిమానా కట్టాల్సిందే. నంబరు ప్లేటుపై పోలీసు, రవాణా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వాహనం నడిపేవారికి ముఖ్య సూచనలు చేస్తున్నారు. నంబరు ప్లేటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని లేకుండే జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు.
దీనంటికీ కారణం పలువురు చోదకులు వాహనం నంబరు ప్లేటుపై ఇష్టానుసార రాతలు, నంబరు ప్లేటు లేకుండా వాహనం నడపడం చేస్తున్నారు. 2016 నుంచి షోరూంలలో వాహనాలను కొన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వం అందజేస్తున్న హై సెక్యూరిటీ నంబరు ఫ్లేట్ను మాత్రమే బిగించుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ చాలా మంది ఆ నిబంధనలను పెడచెవిన పెట్టి వాహనాలను రోడ్లపై పోనిస్తున్నారు.
జరిమానా తప్పదు :మోటారు వాహనాల చట్టం ప్రకారం ఫ్యాన్సీ నంబర్లతో తిరుగుతుంటే రవాణేతర వాహనాలకు రూ.1,150, రవాణా వాహనాలకు రూ.1300 జరిమానాను పోలీసులు, రవాణా శాఖ అధికారులు విధిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే రూ.100 నుంచి రూ.150 వరకు చలానా విధిస్తారు. ఇతర ఉల్లంఘనలు ఉంటే అపరాధ రుసుము పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది.