Vastu Tips for Bedroom : భారతదేశంలో మెజారిటీ జనం వాస్తు ప్రకారమే నడుచుకుంటారు. ఇంటి నిర్మాణం, గదులు, ఇంట్లోని వస్తువులు ఇలా.. అన్నింటిలోనూ కచ్చితంగా వాస్తు నియమాలను పాటిస్తారు. ఇలా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఇంటి నిర్మాణమే కాదు.. లోపల వస్తువుల విషయంలోనూ వాస్తు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే బెడ్‌రూమ్‌లో కొన్ని వస్తువులు ఉంచకూడదని చెబుతున్నారు. వీటి వల్లే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, ఇంట్లో అశాంతి నెలకొనడం వంటివి జరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే.. బెడ్ రూమ్‌ను ఎలా ఉంచుకోవాలో.. బెడ్ కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదో వివరిస్తున్నారు.
చిందరవందరగా ఉంచకూడదు..
చాలా మంది ఇంట్లో ఏవైనా అదనపు వస్తువులు కనిపిస్తే.. ఖాళీ ప్లేస్ ఉందికదా అని వాటిని బెడ్ కిందకు తోసేస్తుంటారు. కానీ.. ఇలా చేయవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా బెడ్ కింద చెత్త, చెల్లాచెదురుగా ఉండే వస్తువులను పెట్టడం వల్ల నిద్రా భంగం కలుగుతుందని అంటున్నారు. అలాగే పాత బట్టలను కూడా బెడ్ కింద ఉంచవద్దట. బెడ్ కింద ఎల్లప్పుడూ ఖాళీ స్థలం శుభ్రంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఇలా చేస్తేనే భార్యభర్తల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉంటాయట.
ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచవద్దు..
కొంత మంది ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను బెడ్ కింద పెడుతుంటారు. కానీ, ఇలా చేయవద్దు. దీనివల్ల భార్యభర్తల మధ్య అనవసరంగా గొడవలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరాల వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందట. కాబట్టి వీటిని బెడ్‌రూమ్ బయట ఎక్కడైనా పెట్టాలని అంటున్నారు.
చెప్పుల విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? - ఆర్థిక నష్టాలు తప్పవట!