Vaikuntha Dwara darshans in Tirumala:తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈనెల 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగియనున్నాయి. పది రోజులపాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6.82 లక్షల మంది భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను తితిదే జారీచేసింది. శుక్రవారం 61,142 మంది భక్తులు దర్శించుకోగా హుండీ కానుకలు రూ.3.15 కోట్లు లభించాయి. శనివారం సాయంత్రానికి సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి నారాయణగిరి షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు - VAIKUNTHA DARSHANS ENDS TODAY TTD
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈనెల 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగియనున్నాయి
VAIKUNTHA DWARA DARSHANS ENDS TODAY IN TTD (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 19, 2025, 12:35 PM IST