ETV Bharat / state

భవిష్యత్​లో టీటీడీ, రామ మందిరం కలిసి పనిచేసే అవకాశం ? అయోధ్య రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన బీఆర్ నాయుడు - TTD PRESENTS SILK ROBES TO AYODHYA

అయోధ్య శ్రీరామునికి టీటీడీ తరఫున పట్టువస్త్రాలు - పట్టువస్త్రాలు అందజేసిన టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు దంపతులు

BR Naidu Ayodhya Tour
BR Naidu Ayodhya Tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2025, 6:43 PM IST

Updated : Jan 19, 2025, 7:06 PM IST

TTD Presents Silk Robes to Ayodhya : అయోధ్య శ్రీరామచంద్రునికి తిరుమల వెంకటేశ్వర స్వామి తరఫున టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీరామ జన్మభుమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బృందం స్వాగతం పలికారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు టీటీడీ బృందానికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఆలయ సందర్శన గొప్ప అనుభూతిని, ఆనందాన్ని కలిగించిందని బీఆర్ నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా వెంకటేశ్వరస్వామికి కూడా అయోధ్య నుంచి భవిష్యత్​లో వస్త్రాలు సమర్పించే అవకాశం ఉందన్నారు. అలాగే ఇక్కడ టీటీడీ దేవాలయాల నిర్మాణానికి ఆలోచిస్తున్నామని వివరించారు. చంద్రబాబు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, ముఖ్య ప్రాంతాల్లో టీటీడీ టెంపుల్స్‌ నిర్మాణానికి ఇప్పటికే సూచనలు చేశారని పేర్కొన్నారు. అయోధ్యలో బాలాజీ దేవాలయ నిర్మాణానికి భూమిని కేటాయించాల్సిందిగా ఇక్కడి ప్రభుత్వాన్ని కోరతామని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈ ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, హెచ్ డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అధికారులు పాల్గొన్నారు.

BR Naidu Visit Ayodhya Temple : అనంతరం బీఆర్ నాయుడు రామ జన్మభూమి ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్​ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇరువురు పలు విషయాలపై చర్చించారు. భవిష్యత్​లో తిరుమల తిరుపతి దేవస్థానం, అయోధ్య రామ మందిరం కలిసి పని చేయడం వంటి అంశాలపై చర్చలు జరిపారు.

మహా కుంభమేళాకు తిరుమల శ్రీవారి కల్యాణ రథం

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - ఇలా చేస్తే టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఇంటికే!

Last Updated : Jan 19, 2025, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.