Kishan Reddy To Inaugurate Train To Goa :ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలనుకునే వారి సౌలభ్యం కోసం మరో రైలును రైల్వేశాఖ ప్రారంభించింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ - వాస్కోడిగామా రైలును ప్రకటించింది. ఇవాళ్టి నుంచి సికింద్రాబాద్ - గోవా రైలు పట్టాలెక్కింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది.
సమయాలివే :ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్‌కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఏయే స్టేషన్లలో ఆగనుందంటే : కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ నెల 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్‌కు అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు గోవా (వాస్కోడిగామా) చేరుకుంటుంది.