Two years Child Suffering With Flatulence : జనగామ జిల్లా, తిమ్మంపేటకు చెందిన కుంభోజు మహేశ్వర్, అలేఖ్య దంపతులకు 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మహేశ్వర్ కులవృత్తి మంగలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడిదిన్నర వరకు ఆరోగ్యంగానే ఉన్న కుమారుడు మాధవన్, గత 6 నెలలుగా అన్నం తినకపోవడం కడుపు ఉబ్బడం, పొట్ట పెరిగి వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అప్పటి వరకు ఇంట్లో సందడిగా తిరిగిన కుమారుడు ఒక్కసారిగా అనారోగ్య పాలవడంతో ఆ దంపతులు తల్లడిల్లిపోయారు.
జిల్లాలో పలు ఆస్పత్రులు తిప్పిగా బాబుకి పెద్ద ప్రమాదం ఉందని హైదరాబాద్ నిలోఫర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నిలోఫర్‌కు డాక్టర్లు బాబుకు అన్ని పరీక్షలు చేసి "గౌచర్ డిసీస్ -1"అనే వ్యాధి ఉందని నిర్ధారించారు. ఈ వ్యాధి లక్షణం ఉన్నవారు రక్తం ఉత్పత్తి అవ్వక చిక్కిపోయి నిరసించి చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
వ్యాధి చికిత్సకు 24 లక్షల రూపాయలు : అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లగా "ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ"అనే ఇంజక్షన్ వేయాల్సి ఉంటుందని, నెలకు రెండు వేయాలని వైద్యులు చెప్పారు. ఇంజక్షన్ ధర లక్ష 24 వేల రూపాయలు ఉంటుందని, అవి జీవిత కాలం వాడాలని చెప్పడంతో ఆర్థిక స్తోమత లేక ఆ దంపతులు వెనుతిరిగారు. చివరికి జూబ్లీహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో వ్యాధికి శాశ్వత చికిత్స చేయొచ్చని, అందుకు రూ. 24 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు.