Two Villagers Dispute for Buffalo:రెండు ఊర్ల ప్రజలంతా ఎస్పీ కార్యాలయం ముందు భారీగా గుమిగూడారు. ఆ దృశ్యం చూసిన వాళ్లంతా రెండూర్ల మధ్య పెద్ద పెద్ద గొడవలు చోటు చేసుకున్నాయని అనుకునేలా పరిస్థితి కనిపించింది. కానీ అసలు విషయం తెలిస్తే ఎవ్వరైనా విస్తుపోవాల్సిందే. ఆ రెండు గ్రామాల ఊర్ల ఆడవాళ్లు, మగవాళ్లు అక్కడ చేరి స్టేషన్ ముందు కూర్చుని వాళ్లకు న్యాయం జరగాలని కూర్చున్నారు. అయితే పోలీసులు వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే!
అనంతపురం జిల్లాలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య వైరాన్ని తీసుకొచ్చింది. కూడేరు మండలం ముద్దలాపురం గ్రామస్థులు మూడేళ్ల క్రితం ముత్యాలమ్మ దేవతకు దున్నపోతును వదిలారు. అది ఊళ్లలో తిరుగుతూ కదరకుంట గ్రామానికి చేరుకుంది. అయితే ఈ దున్నపోతు (Buffalo) తమదేనంటూ కదరకుంట గ్రామస్థులు బంధించారు. విషయం తెలుసుకున్న ముద్దలాపురం గ్రామస్థులు కదరకుంట వెళ్లి దున్నపోతును తీసుకెళ్లేందుకు యత్నించారు. దున్నపోతు తమదంటే, తమదంటూ ఇరు గ్రామాలు గొడవకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
శానంభట్లలో ముందుగానే సంక్రాంతి - పశువుల వేడుకతో షురూ
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు: చివరకు జిల్లా కలెక్టర్ వద్దకు పంచాయితీ చేరింది. ఆ సమయంలో కలెక్టర్ (Collector) అందుబాటులో లేకపోవడంతో ముద్దలాపురం గ్రామస్థులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. దున్నపోతును తమకిచ్చి న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దేవర (Devara) కోసం మూడేళ్ల క్రితం దున్నపోతును వదిలామని కానీ కదరకుంట వాసులు తమదంటూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే దున్నపోతును గ్రామాలకు సంబంధం లేకుండా స్వేచ్ఛగా వదిలేయాలని పోలీసులు ఆదేశించారు.