Two Love Couples suicide in Markapuram Mandal : ఇరు మనసుల్ని ఏకం చేసేది ప్రేమ! ఆ ప్రేమే నలుగురి జీవితాల్లో కల్లోలం రేపింది. ఆప్తుల కుటుంబాల్లో విషాదం నింపింది. వందేళ్లు వర్థిల్లాల్సిన అనురాగం క్షణికావేశంతో వసివాడిపోయింది. మార్కాపురంలో ఒకే రోజు రెండు ప్రేమ జంటలు వేర్వేరుచోట్ల బలవన్మరణానికి పాల్పడటం అక్కడివారిని కలచివేసింది. ఇందులో పరిపక్వత లేని యువ జంట, జీవితంపై అవగాహన ఉన్న మరో జంట ఉన్నాయి. అందులో తెల్లారితే కల్యాణం జరగాల్సిన ఓ యువతీ ఉండటం వేడుకకు వచ్చిన వారి హృదయాల్ని ద్రవింపజేసింది. స్థానికులు పోలీసుల కథనం మేరకు ఈ సంఘటనల వివరాలిలా ఉన్నాయి.
మార్కాపురం మండలంలోని కోమటికుంట, పిచ్చిగుంట్లపల్లెలో రెండు ప్రేమ జంటలు బలవన్మరణానికి పాల్పడ్డాయి. పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేక ఓ జంట తనువు చాలించగా తాము కలసి ఉండలేమన్న ఆందోళనతో మరో జంట ప్రాణాలు తీసుకుంది. గజ్జలకొండ పంచాయతీలోని పిచ్చిగుంట్లపల్లికి చెందిన జక్కుల గోపి ఇంటర్ పూర్తి చేసి గ్రామ వాలంటీరుగా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన నాగేశ్వరి అనే అమ్మాయి ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. వీరి ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది.
అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యయత్నం - భర్త మృతి - Couple suicide attempt
గత నాలుగు సంవత్సరాలుగా వీరు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దవాళ్లకు ఆ విషయం చెప్పలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు దొనకొండ మండలంలోని బంధువుల అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి ఇష్టం లేని యువతి, ప్రేమించిన వ్యక్తి ఇద్దరూ శనివారం ఉదయం ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఇద్దరు కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా స్థానిక పశువుల కాపర్లు గ్రామ శివార్లలో విగత జీవుల్లా ఇద్దరు పడి ఉండటాన్ని గమనించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మార్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.