Two Injured in Road Accident at Jammikunta :కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్ర వాహనదారుడు డివైడర్ వద్ద యూటర్న్ తీసుకొని ముందుకు వస్తుండగా హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వైపు వస్తున్న ఓ కారు ఢీ కొట్టింది.
Road Accident Video Viral :ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అవి బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.క్షతగాత్రులనుజమ్మికుంట మండలం పెద్దంపేటకు చెందిన దొడ్డే రాజయ్య, జమ్మికుంట దుర్గ కాలనీకి చెందిన సంపత్లుగా గుర్తించారు. చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంపత్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.