TTD Key Decision on Tirumala Laddu Prasadam:తిరుపతి దర్శనమంటే భక్తులకు అదొక మధురానుభూతి. భక్తులు శ్రీవారిని ఎంత భక్తితో పూజిస్తారో స్వామి ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తారు. శ్రీవారి నివేదనలకు ఎన్నో రకాల ప్రసాదాలు తయారవుతున్నా లడ్డూలకు మాత్రం ప్రత్యేక ఆదరణ ఉంది. అందుకే తిరుపతి వచ్చిన భక్తులు వెంకన్నని చూశాక ఎంత ఆనందిస్తారో శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతారు. ఎందుకంటే ఆ రుచి వేరు అంతే. ఎవరైనా తిరుమల వెళ్లొచ్చాం అని చెప్పగానే దర్శనం ఎలా జరిగింది అని అడగకుండా లడ్డూ ఏది అని అడుగుతారు. మరి భక్తులకు అంతలా చేరువైంది ఈ లడ్డూ ప్రసాదం.
ప్రస్తుతం శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూలు పరిమితి ప్రకారం ఇచ్చేవారు. దీంతో లడ్డూలు ఎక్కువ తీసుకోవాలనే వారికి నిరాశే ఎదురయ్యేది. ఈ పరిస్థితిని మార్చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బందిని నియమించడానిక సిద్ధమవుతోంది. దేవస్థానంలో ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6000 పెద్ద లడ్డూలు (కల్యాణం లడ్డూ), 3,500 వడలు తయారవుతున్నాయి.
కొత్త శోభ సంతరించుకున్న తిరుగిరులు - కనువిందు చేస్తున్న కపిలతీర్థం జలపాతం