How To Make Vankaya Tomato Pachadi : మనలో చాలా మందికి పచ్చడి అనగానే ఆవకాయ, ఉసిరికాయ, టమాటా, దొండకాయ వంటివే ఎక్కువగా గుర్తుకువస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు నాన్‌వెజ్ పచ్చళ్లు కూడా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ ఒకే రకం పచ్చళ్లు కాకుండా ఈసారి కొత్తగా వంకాయ టమాటాలు కాల్చి పచ్చడిని ట్రై చేయండి. ఈ పచ్చడిని ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా. ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే ఎంతో కమ్మగా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం నోరూరించే టేస్టీ వంకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- పెద్ద వంకాయలు - 2
- ఉల్లిపాయలు - 4
- టమాటాలు - 3
- పచ్చిమిర్చి - 6
- వెల్లుల్లి రెబ్బలు - 10
- కారం - టీస్పూన్
- గరం మసాలా - టీస్పూన్
- ఆవాలు - అర టీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పసుపు - చిటికెడు
తయారీ విధానం:
- ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. ఇప్పుడు కత్తి సహాయంతో నాలుగు వైపులా పొడవుగా గాట్లు పెట్టుకోవాలి. ఈ గాట్ల మధ్యలో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను ఉంచాలి.
- ఆపై వంకాయలకు నూనె అప్లై చేసుకోండి. ఇప్పుడు స్టౌపై గ్రిల్ స్టాండ్ పెట్టుకోండి. దీనిపై నూనె రాసిన వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఉంచండి.
- కూరగాయల స్కిన్ అన్ని వైపులా నల్లగా మారే వరకు కాల్చుకోండి.
- తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి చల్లారిన తర్వాత వాటిపై పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో 2 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. వేడివేడి నూనెలో జీలకర్ర, ఆవాలు వేసి వేపండి. ఆపై ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలపండి.
- ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత కారం, గరం మసాలా, పసుపు వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు కాల్చుకున్న టమాటా, వంకాయలు, పచ్చిమిర్చి వేసి కలపండి.
- తర్వాత అన్ని బాగా కలిసేలా మ్యాష్ చేసుకోండి. ఒక రెండు నిమిషాల తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే నోరూరించే వంకాయ టమాటా పచ్చడి మీ ముందుంటుంది.
'దహీ ఇడ్లీ' సింపుల్ టిప్స్‌తో ఇలా ట్రై చేయండి - ఒక్కటి కూడా వదలరు
రాయలసీమ స్పెషల్ "ఉగ్గాని బజ్జీ" - ఇలా చేస్తే టేస్ట్ సూపర్ గురూ!