ETV Bharat / state

ప్యాకేజి విశాఖ ఉక్కును గట్టెక్కిస్తుందా? సెయిల్ వాదన ఏంటీ? - FUTURE OF VIZAG STEEL

సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం చేయాలన్న ఆశలు ఆవిరి-నష్టాల్లో ఉన్న సంస్థను కలపటానికి వీల్లేదని అంటోన్న సెయిల్

pratidhwani
pratidhwani (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 3:38 PM IST

Pratidhwani : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్‌)లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విలీనం చేయాలన్న ఆశలు ఆవిరయ్యాయి. లాభాల్లో ఉన్న మా కంపెనీలో నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును కలపటానికి వీల్లేదని సెయిల్ అంటోంది. ముందు నష్టాలు తగ్గించుకుని లాభాల బాట పట్టాకా అప్పుడు చూద్దామని ఆ సంస్థ చెబుతోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మనే చెప్పారు. తెలుగు ప్రజలకు విశాఖ ఉక్కుతో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి.

ఆ కర్మాగారాన్ని కాపాడుకోవటం అందరి బాధ్యత. అయితే సెంటిమెంట్ ఉంటే సరిపోదు. సమస్యల సెటిల్మెంట్ కూడా జరగాలి. అదే ఎలా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం 11వేల కోట్లతో ఇటీవలే ఒక ప్యాకేజి ప్రకటించింది. ఆ సాయానికి అందరూ సంతోషిస్తున్నారు. అయితే అది సరిపోతుందా? ఇంకా ఏం జరగాల్సి ఉంది? ముడిసరుకు మాటేంటి? ఇప్పటికే ఉన్న అప్పులు తీరేదెలా? మూతపడిన ప్లాంట్లు తెరిచేదెలా? ఇదే అంశాలపై స్టీల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్) మాజీ స్వతంత్ర డైరెక్టర్ కాశీ విశ్వనాథ రాజు, బీఎమ్​ఎస్​ స్టీల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్​ కొమ్మినేని శ్రీనివాసరావు లు తమ అభిప్రాయాల్లో ఏం వెల్లడించారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకోవటం కోసం కేంద్రం 11 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఉన్న మొత్తం సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో 11వేలకోట్లు రావటం సంతోషకరమే. అయితే ఆ సంస్థని కష్టాల నుంచి గట్టెక్కించటానికి అది ఎంతవరకు దోహదపడుతోంది?

విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలన్న చిరకాల డిమాండ్లపై ఆ సంస్థ నీళ్లు చల్లింది. నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను మేము తీసుకోమని నిర్మోహమాటంగా సెయిల్ చెప్పేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మే చెప్పారు. దీనిపై సెయిల్ మాజీ డైరెక్టర్‌ ఎమంటున్నారు? అసలు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవేంటి? 11వేల కోట్ల ఆర్థికసాయం చేసిన తర్వాత కూడా ఇంకా ఏవేం సమస్యలు తీరాల్సి ఉంది?

సెయిల్ వద్దంటోంది - కారణం అదే! విశాఖ స్టీల్​పై కేంద్రమంత్రి క్లారిటీ

దేశంలో ఉన్న స్టీల్‌ప్లాంట్లు అన్నీ నష్టాల్లోనే ఉన్నాయా అనే వాదన తలెత్తుతోంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ మాత్రం ఎందుకు అంత ఇబ్బందుల్లో పడింది? ఆనాడు 64 గ్రామాల ప్రజలు 22వేల ఎకరాలను విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇచ్చారు. అనేక బాలారిష్టాల తరవాత 2002 నుంచి స్టీలు ప్లాంటు లాభాల బాట పట్టింది. 2005-06లో కర్మాగారం సామర్థ్యాన్ని ముప్ఫై లక్షల టన్నుల నుంచి 73 లక్షల టన్నులకు విస్తరించారు. అలాంటి వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు కష్టాలు ఎప్పట్నుంచి, ఎందుకు మొదలయ్యాయి? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

చైనాతో పోటీపడేలా ఉక్కు ఉత్పత్తిని పెంచాలనేది కేంద్రం లక్ష్యం. సెయిల్ ఒక్కటే ఆ పని చేయలేకపోతోంది. అదే విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేస్తే తక్కువ పెట్టుబడితో డెబ్భై లక్షల టన్నుల ఉత్పత్తి సాధించవచ్చు. ఈ విలీనంతో కనీసం రూ.30వేల కోట్లు ఆదా కావడంతో పాటు, తక్షణమే ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందనే వాదన కూడా ఉంది.సెయిల్‌ కూడా ఇప్పుడు తిరస్కరించటంతో ఉన్న ఆ ఒక్క ఆశ కూడా పోయింది. ఇప్పుడేం జరగాలి? వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు మంచి రోజులు రావాలంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, సంస్థ యాజమాన్యం, కార్మికులు ఎవరెవరు ఏం చేయాలి? అనే అంశాలపై సమగ్ర నమాచారాన్ని ఈ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

'ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మాటే ఉండదు' - ఆర్థిక సాయంపై కూటమి నేతల హర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.