తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమల ప్రశాంతతను దెబ్బతీస్తే సహించేది లేదు: టీటీడీ ఛైర్మన్​ - TIRUMALA TEMPLE IN AP

తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్న టీటీడీ ఛైర్మన్‌ - ఇటీవలె తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్ వ్యాఖ్యలు​

FORMER MINISTER SRINIVAS GOUD
TTD CHAIMAN WARNING (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 12 hours ago

Updated : 11 hours ago

TTD Chairman Latest Tweet : తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక ట్వీట్ పెట్టారు. తిరుమల పవిత్ర క్షేత్రమని ఇది రాజకీయ వేదిక కాదన్నారు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగిందని తెలిపారు.

చర్యలకు ఆదేశిస్తున్నాం : తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా టీటీడీ పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకుందని వివరించారు. ఎంతటివారైనా సరే తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేదేలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తిరుమల దేవస్థానం వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని ఉల్లంఘన కింద పరిగణిస్తున్నామని అన్నారు. ఆయనపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారనే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ ఈ విధంగా స్పందించారు.

"తెలంగాణ ప్రజలకు ఆంధ్రాతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తి తిరుపతిలో తలనీలాలు సమర్పించుకునే నమ్మకం ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ సమస్య లేదు. ప్రస్తుత పరిస్థితి అయితే బాగాలేదు. టీటీడీ పాలక మండలి మీద మాకు గౌరవం ఉంది. కానీ తెలంగాణ ప్రజల పట్ల కొంత భేదం కనిపిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి గారు త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి. హైదరాబాద్​లో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారి పట్ల మేము ఎలాంటి వివక్ష చూపలేదు. తెలంగాణలో ఎక్కడ నీరుంటే, ఎక్కడ కాలువలుంటే అక్కడ ఆంధ్రావారు వచ్చి వ్యవసాయం చేశారు. ఎప్పుడు కూడా వాళ్లపై భేదం చూపలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మాకంటే ఎక్కువగా లబ్ది పొందిందే కూడా ఆంధ్రా వ్యాపారస్థులే. కాంట్రాక్టర్లు, బిల్డర్లు చూసినా ఆర్థికంగా బలపడిన వాళ్లను చూసినా ఆంధ్రావాళ్లే ఉన్నారు. ఇలా ఉంటే తర్వాత హైదరాబాద్​లో వాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది".-మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

‘తిరుమల విజన్‌-2047’ - ప్రతిపాదనలు ఆహ్వానించిన తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు - టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే

Last Updated : 11 hours ago

ABOUT THE AUTHOR

...view details