గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్ - పరీక్షల షెడ్యూల్ విడుదల - TGPSC ANNOUNCED GROUP 3 EXAM
గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ కీలక అప్డేట్ - పరీక్షలకు వారం రోజుల ముందునుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి
Published : Oct 11, 2024, 2:51 PM IST
|Updated : Oct 11, 2024, 2:58 PM IST
TGPSC Announced Group 3 Exam Update : తెలంగాణ గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు ఉంటాయని ఇప్పటికే వెల్లడించగా, ఈమేరకు తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎగ్జామ్స్కు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. మోడల్ ఆన్సర్ బుక్లెట్లను వెబ్సైట్లో ఉంచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది.