TS Inter Admission 2024 schedule :రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 9 నుంచి జూన్ 30వ తేదీ వరకు తొలివిడత అడ్మిషన్లు చేపట్టాలని స్ఫష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ - ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ, కేజీబీవీ, టీఎస్ మోడల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభించాలని స్ఫష్టం చేసింది.
Board Of Intermediate On Inter 1st Year Classes :జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతలు ప్రారంభించాలని ఆదేశించింది. ఇంటర్నెట్ మార్కు మెమోల ఆధారంగా ప్రొవిజనల్ అడ్మిషన్లు చేయాలని పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసిన తర్వాత అడ్మిషన్లు ఖరారు చేయాలని కోరింది. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, దివ్యాంగులకు 5, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటాకి 5, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా 3, ఈడబ్ల్యూఎస్ కి 10 శాతం సీట్లు రిజర్వ్ చేయాలని ఉన్నత ఇంటర్ బోర్డ్ స్ఫష్టం చేసింది. రెండో విడత అడ్మిషన్ల గురించి త్వరలో ప్రకటిస్తామని ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఈ మేరకు ఆయా కళాశాలల ప్రధానాచార్యులు అడ్మిషన్ల ప్రక్రియ కోసం తగు చర్యలు తీసుకోవాలని కోరింది.