TS Govt Letters To All Collector To Provide Information To ED :గొర్రెల పంపిణీ పథకం అక్రమాలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టగా, అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిర్ణయించింది. సర్కార్ ఆదేశాల మేరకు ఈడీ కోరిన సమాచారం వెంటనే అందించాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య అన్ని జిల్లాల కలెక్టర్లకు శుక్రవారం లేఖ రాసింది. పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇన్ఛార్జీ సంచాలకుడు సబ్యసాచి ఘోష్‌ను సచివాలయంలో శుక్రవారం సమాఖ్య ఇన్ఛార్జీ ఎండీ సుబ్బరాయుడు కలిశారు.
ED Focused on Sheep Scam in Telangana :ఈడీ కోరిన వివరాలు రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో లేవని, జిల్లా పాలనాధికారి వద్ద ఉన్నాయని ముఖ్య కార్యదర్శికి ఎండీ చెప్పారు. దీంతో అక్కడి నుంచి సమాచారం సేకరించి ఈడీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు సుబ్బరాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. 2017 నుంచి 2024 వరకు పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారాన్ని కూడా పంపించాలని ఆదేశించారు.
గొర్రెల పంపిణీ స్కామ్‌లో భారీగా మనీలాండరింగ్ - రంగంలోకి ఈడీ - ED INQUIRY ON TG SHEEP SCAM 2024