తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో గిరిజనుల మధ్య భూ వివాదం - అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడి - people attack on police - PEOPLE ATTACK ON POLICE

Tribals Attacked Police in Khammam District : ఖమ్మం జిల్లాలో పోలీసులపై దాడి జరిగింది. చంద్రపాయపాలెంలో పోడు భూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గొడవ ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే గిరిజనులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి.

Tribals Attacked Police in Khammam District
Tribals Attacked Police in Khammam District

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 1:37 PM IST

Updated : Apr 1, 2024, 9:15 AM IST

ఖమ్మం జిల్లాలో గిరిజనుల మధ్య భూ వివాదం

Tribals Attacked Police in Khammam District : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణను ఆపాలని ప్రయత్నించిన పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. ఓ వర్గం కర్రలతో వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు. చంద్రాయపాలెం శివారులోని 9 హెక్టార్లలోని అటవీ భూమికి సంబంధించి కొన్నేళ్లుగా రెండు గిరిజన వర్గాల మధ్య గొడవ జరుగుతోంది.

Khammam Tribal Attack on Police :ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చంద్రాయపాలెం వర్గం, నాగుపల్లి,బుగ్గపాడు, మొండివర్రె తదితర గ్రామాలకు చెందిన మరో వర్గానికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని సాంబశివరావు అనే వ్యక్తి డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. దీంతో సత్తుపల్లి సీఐ టి.కిరణ్‌తోపాటు పోలీసు సిబ్బంది ఇమ్రాన్‌, సత్యనారాయణ, నరేశ్‌, నరసింహారావులు ఘటనా స్థలానికి వెళ్లారు.

Bhadrachalam Temple Lands Issue : రామ రామ ఇదేం దుర్మార్గం.. అక్రమ నిర్మాణాలు అడ్డుకున్నందుకు అధికారులపై దాడి

సీఐ, సిబ్బందిపై దాడి చేసిన గిరిజనులు : ఘర్షణకు పాల్పడుతున్న రెండో వర్గానికి నాయకత్వం వహిస్తున్న కూరం మహేందర్‌ను సీఐ కిరణ్‌ అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పలువురు గిరిజనులు అడ్డుకున్నారు. అనంతరం సీఐ, సిబ్బందిపై (Attack on Officers) కర్రలు, వెదురుబద్దలతో దాడికి పాల్పడ్డారు. ఆయనను వెంబడించి చొక్కాను చించివేసి కొట్టారు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకొని ఐదుగురూ బయటపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు కల్లూరు ఏసీపీ రఘు ఆధ్వర్యంలో సత్తుపల్లి, వైరా సబ్‌ డివిజన్‌లోని పోలీసులు, ఖమ్మం ఏఆర్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని రంగంలోకి దింపారు.

ఈ దాడికి పాల్పడిన అనుమానిత గిరిజనులను బుగ్గపాడులో ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించామని చెప్పారు. మొత్తం 19 మంది మహిళలపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపామని అన్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా 1986లో సదరు భూములకు సంబంధించి ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందని చంద్రాయపాలెం గిరిజనులు అంటున్నారు. అది కాదని తమకు 1976-77లోనే పట్టాలిచ్చారని మరో వర్గం చెబుతోంది.

సూర్యాపేట జిల్లాలో ఎక్సైజ్ అధికారులపై నిందితుల దాడి - ATTACK ON officers in Suryapet

మున్సిపల్ సిబ్బందిపై కొబ్బరి బోండాల నిర్వాహకుల రాళ్ల దాడి - Attack on municipal staff

Last Updated : Apr 1, 2024, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details