తెలంగాణ

telangana

ETV Bharat / state

నాతో చేతులు కలపండి - ప్రభుత్వ సంకల్పంలో భాగం అవ్వండి : ఎన్టీఆర్‌ - NTR on Drugs Awareness

NTR on Drugs Awareness : మాదక ద్రవ్యాలకు ఆకర్షితులై ఎంతోమంది యువత తమ జీవితాలను నాశం చేసుకుంటున్నారని టాలీవుడ్‌ హీరో ఎన్టీఆర్‌ అన్నారు. డ్రగ్స్ రహిత లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పిలుపునిచ్చారు.

Jr. NTR Awareness on Drug Addiction
Jr. NTR on Drugs (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2024, 9:44 AM IST

Updated : Sep 25, 2024, 10:25 AM IST

NTR Awareness on Drug Addiction : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి యువత సహకరించాలంటూ సినీ నటుడు జూనియర్​ ఎన్టీఆర్​ పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్​కు ఆడిక్ట్​ అయి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటుున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్​కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ఎక్స్​ వేదికగా ఎన్టీఆర్‌ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.

'జీవితం చాలా విలువైనది, రండి నాతో చేతులు కలపండి. మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది' అని ఎన్టీఆర్‌ ఎక్స్​ వేదికగా విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో లేదంటే సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్‌ కోసమో డ్రగ్స్​కు ఆకర్షితులు కావడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని సూచించారు.

సినీ పరిశ్రమకు సీఎం రేవంత్​ విజ్ఞప్తి :ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఓ కార్యక్రమంలో డ్రగ్స్​, సైబర్​ క్రైమ్​పై సినీ పరిశ్రమ యువతకు అవగాహన కల్పించాలని సూచించిన విషయం తెలిసిందే. టికెట్​ రేట్ల పెంపునకు అనుమతి అంటూ వచ్చే వారికి ఆయన ఓ షరతు పెట్టారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్​, సైబర్​ నేరాలపై రెండు నిమిషాల అవగాహన వీడియో చిత్రీకరించాలని సూచించారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని తెలిపారు.

సే నో టూ డ్రగ్స్ అంటూ విజయ్​ దేవరకొండ విజ్ఞప్తి :ఈ నేపథ్యంలోనే పలువురు సినీ తారలుడ్రగ్స్​ రహిత లక్ష్యంగా ​రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్​ దేవరకొండ, సీనియర్​ నటుడు మోహన్​ బాబు సైతం డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్​కు సహకరిస్తూ వీడియో విడుదల చేశారు. డ్రగ్స్​ వల్ల యువత తమ జీవితాలను నాశం చేసుకోవద్దని సూచించారు. యువత బాధ్యతగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 'సే నో టూ డ్రగ్స్'​ అంటూ పిలుపునిచ్చారు.

క్యాన్సర్​తో పోరాడుతున్న అభిమానికి జూ.ఎన్టీఆర్​ వీడియోకాల్​ - ధైర్యంగా కోలుకుని బయటకు రావాలని ఆకాంక్ష - JR NTR Video Call To His Fan

Last Updated : Sep 25, 2024, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details