ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి - ఇద్దరికి గాయాలు - Two Persons Dead in Car Accident - TWO PERSONS DEAD IN CAR ACCIDENT

Two Persons Dead in Car Accident: పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

Two Persons Dead in Car Accident
Two Persons Dead in Car Accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 2:58 PM IST

Two Persons Dead in Car Accident:పల్నాడు జిల్లాలోని అందుగుల కొత్తపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గుంటూరు నుంచి నంద్యాల వైపు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Women Dead in Road Accident:బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని ద్వారకా నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ గుర్రంవారిపాలెం గ్రామానికి చెందిన పాలపర్తి రేణుకగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ప్రకాశం జిల్లా అగ్రహారానికి చెందిన వారుగా వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్రంవారిపాలెం గ్రామానికి చెందిన దంపతులైన సుబ్బారావు, రేణుకలు చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ మాదిరిగా శింగరకొండ భవనాసి చెరువు వద్ద చేపలను తీసుకొని అద్దంకికి వెళుతుండగా ద్వారకా నగర్ వద్ద లారీ ఢీకొనడంతో రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. లారీ చోదకుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పౌరసరఫరాల గోదాములో మంటలు- బియ్యం సంచులు అగ్నికి ఆహుతి - Fire in Civil Supply Ware House

One Deer Dead in Road Accident: శ్రీ సత్యసాయి జిల్లాలోని పయ్యాల వాండ్లపల్లి బస్టాప్ వద్ద జాతీయ రహదారిని దాటుతున్న రెండు జింకలను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకటి అక్కడికక్కడే మృతి చెందగా మరొకటి తీవ్రంగా గాయపడింది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన జింకకు ప్రథమ చికిత్స చేసి జూపార్కుకు తరలించారు. అనంతరం మృతి చెందిన జింకకు శవపంచనామ చేసి కదిరి పశు వైద్యశాలకు తరలించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Current Shock while Rathotsavam in Chinna Tekur: కర్నూలు సమీపంలోని చిన్న టేకుర్‌లో విద్యుదాఘాతంతో 15 మంది చిన్నారులు గాయపడ్డారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా చిన్న టేకుర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రథోత్సవం నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రథానికి విద్యుత్​ తీగలు తగిలి పక్కనే ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను స్థానికులు వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు ప్రాణాపాయం ఏమి లేదని వైద్యులు తెలిపారు.

జాతీయ రహదారిపై అదుపు తప్పిన బస్సు- పది మందికి తీవ్ర గాయాలు - BUS ACCIDENT ON NATIONAL HIGHWAY

ABOUT THE AUTHOR

...view details