Attack On MPTC in Parvathipuram:పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలికి చెందిన టీడీపీ ఎంపీటీసీ ఉమామహేశ్వరరావుపై దుండగులు కత్తితో దాడి చేశారు. గాయపడిన అతన్ని హుటాహుటిన అనుచరులు సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?:పాంచాల గ్రామానికి చెందిన గండ్రోత్ శ్రీను ఉపాధి కోసం విశాఖపట్నం వెళ్లాడు. సంక్రాంతి పండగ నేపథ్యంలో శ్రీను ఇంటికి వచ్చాడు. సాలూరు పాంచాలి మోసూరు కూడలి సమీపంలో పాన్ షాప్‌కి వెళ్లాడు. అయితే ఇంటికి బైక్‌పై తిరిగి వస్తుండగా రోడ్డుకు అడ్డంగా నిల్చుని అల్లరి చేస్తున్న యువతను పక్కకు తప్పుకోవాలని శ్రీను సూచించాడు. ఈ సమయంలో శ్రీనుపై గండేపల్లి శివ అనే వ్యక్తి దాడి చేసి అతని సెల్‌ఫోన్, డబ్బులు లాక్కున్నారు. విచిత్రం ఏమిటంటే ఆ డబ్బులను శ్రీను దగ్గర నుంచి తీసుకుంది అతని స్నేహితుడే కావడం గమనార్హం.
భూవివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. గొడ్డలి, కర్రలతో దాడి
ఎంపీటీసీ గొంతు కోసిన దుండగులు: తనకు జరిగిన అన్యాయానికి ఆవేదన చెందిన శ్రీను పొలం నుంచి అదే దారిలో వెళ్తున్న ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు కనిపిస్తే పిలిచి చెప్పాడు. దీనికి చలించిపోయిన అతను సెల్‌ఫోన్, డబ్బులు ఇచ్చేయాలని సదరు యువకులను కోరాడు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు 'అడగడానికి నువ్వు ఎవడివి' అంటూ అతనిపై సైతం శివతో సహా మిగిలిన వారు దాడి చేసి సెల్ ఫోను డబ్బులు లాక్కున్నారు.