Tirumala Temple Arjitha Seva Services April Quota Tickets: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఈ టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది.
ఏప్రిల్ 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను జనవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కేటాయింపునకు సంబంధించి ఏప్రిల్ కోటాను జనవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
మరిన్ని శ్రీవారి సేవలు - టికెట్ల విడుదల తేదీలు
- అంగ ప్రదక్షిణం కోటా - జనవరి 23 - ఉదయం 10 గంటలకు
- శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటా - జనవరి 23 - ఉదయం 11 గంటలకు
- వృద్ధులు, దివ్యాంగుల దర్శనం కోటా - జనవరి 23 - మధ్యాహ్నం 3 గంటలకు
- ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటా - జనవరి 24 - ఉదయం 10 గంటలకు
- తిరుమల, తిరుపతిలలో గదుల కోటా - జనవరి 24 - మధ్యాహ్నం 3 గంటలకు
- శ్రీవారి సాధారణ సేవ కోటా - జనవరి 27 - ఉదయం 11 గంటలకు
- శ్రీవారి నవనీత సేవ కోటా - జనవరి 27 - మధ్యాహ్నం 12 గంటలకు
- శ్రీవారి పరాకామణి సేవ కోటా - జనవరి 27 - మధ్యాహ్నం 1 గంటలకు
శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను టీటీడీ వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది.