తెలంగాణ

telangana

ETV Bharat / state

నో షేవ్​ నవంబర్ : గడ్డం పెంచుతూ ఆరోగ్యం పంచుతూ - వీరి బియర్డ్‌కు సూపర్​ బ్యాక్​ స్టోరీ!

బియర్డ్‌ క్లబ్‌ వేదికలపై గడ్డంతో తళుక్కుమంటున్న యువకులు - పురుషులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ క్యాన్సర్‌ రోగులకు చేయూతనందించేందుకు తోడ్పాటు

NO SHAVE NOVEMBER
Youth Participation in Beard Club Shows (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 5:22 PM IST

Youth Participation in Beard Club Shows :ప్రస్తుతం స్టార్​ హీరోల నుంచి సామాన్యుల వరకు స్టైలిష్‌గా గడ్డం పెంచుకుంటున్నారు. ఇప్పుడు గడ్డం పెంచుకోవడమే ఒక ట్రెండ్​గా కొనసాగుతోంది. అయితే ఇదే ఫ్యాషన్‌ రంగంలో తమ స్థానం నిలబెట్టుకోవటానికి ఒకరు, దీన్ని వృత్తిగా మలుచుకొన్నవారు మరొకరు, కార్పొరేట్‌ స్థాయిలో ఉండాలనే పట్టుదలతో ఇంకొకరు ఇలా ఆ ముగ్గురు బియర్డ్‌ క్లబ్‌ వేదికలపై గడ్డంతో సందడి చేస్తున్నారు. ఫ్యాషన్​ కోసమే గడ్డం పెంచుకోవడం లేదని, దాని వెనుక ఒక ప్రయోజనం కూడా దాగి ఉందని చెబుతున్నారు ఈ యువకులు. మనిషి రూపాన్ని చూసి గుణాన్ని అంచనా వేయొద్దని, ఎవరినీ చులకనగా చూడొద్దని అంటున్నారు. ఈ నెలలో నో షేవ్​ నవంబర్​ నినాదంతో ఆన్​లైన్​లో ప్రచారం కల్పిస్తున్నారు.

షేక్‌ నసీమ్ (ETV Bharat)

కాలేజీ టైంలోనే మోడలింగ్‌లో రాణించాలనే ఉద్దేశంతో గడ్డంపై ఇష్టం పెంచుకున్నట్లు షేక్‌ నసీమ్ తెలిపారు. ఇలా గడ్డంపై ఇష్టం​ ఉన్న కొంతమందితో కలిసి బియర్డ్​ క్లబ్‌లో చేరినట్లు చెప్పారు. అందుకు తగ్గట్లుగా తనకు తాను ప్రత్యేకంగా కనిపించాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. బియర్డ్‌ క్లబ్‌లోని సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకున్నట్లు వివరించారు. రెండుసార్లు చెన్నైలో జరిగిన బియర్డ్‌ క్లబ్‌ షోలలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రైవేట్​ పని చేసుకుంటున్నానని, కొంతకాలం తర్వాత మళ్లీ షోలలో పాల్గొంటానని తెలిపారు.

రూపేశ్‌నాయక్ (ETV Bharat)

కార్పొరేట్‌ తరహాలో సెలూన్‌ :ఖమ్మం బియర్డ్‌ క్లబ్‌ అసోసియేషన్‌ నెలకొల్పి పలు షోలు నిర్వహించినట్లు బియర్డ్‌ క్లబ్‌ అధ్యక్షుడు రూపేశ్‌నాయక్ తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పది జిల్లాల్లోని బియర్డ్‌ క్లబ్‌ అసోసియేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రం నుంచి మొదటిసారి బియర్డ్‌ షోలో ర్యాంప్‌వాక్‌ చేసింది తానేనని అన్నారు. పలు రాష్ట్రాల్లో జరిగిన బియర్డ్‌ క్లబ్‌ షోలలో న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించినట్లు చెప్పారు. తాను ప్రైవేట్​ ఉద్యోగం చేస్తున్నానని, ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు తమ గ్రామం అని తెలిపారు. ఈ నెలలో వృద్ధాశ్రమాల్లో ఖమ్మం, హైదరాబాద్‌ బియర్డ్‌ క్లబ్‌ తరఫున ఆహారం పంచిపెడుతున్నామని, కార్పొరేట్‌ తరహాలో సెలూన్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు.

2009లో స్థాపన :2009లోనే నో షేవ్‌ నవంబర్‌ అనే వేదికను స్థాపించారు. ఈ నేపథ్యంలో పురుషులకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు క్యాన్సర్‌ రోగులకు చేయూతనందించేందుకు కొంతమంది వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిధులు సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని చెబుతున్నారు.

వంగేటి వంశీకృష్ణ (ETV Bharat)

ఫ్యాషన్‌తోనే వృత్తిగా మలుచుకొని :తమ సొంతూరు కొత్తగూడెం అని, ఇప్పటికే పుణేలో జరిగిన బియర్డ్‌ క్లబ్‌ షోలలో రెండుసార్లు పాల్గొన్నట్లు వంగేటి వంశీకృష్ణ తెలిపారు. తన నాన్న సత్తుపల్లిలో సింగరేణి ఉద్యోగిగా పని చేసి రిటైర్‌ అయ్యారని, కొవిడ్​ లాక్​డౌన్​ టైంలోనే మొబైల్​లో హెయిర్​కట్​ వీడియోలు చూసి నేర్చుకున్నట్లు వివరించారు. ఆ సమయంలో సెలూన్​​ షాపులు బంద్​ ఉండటంతో పరిచయం ఉన్నవారి ఇళ్లకు వెళ్లి కటింగ్​ చేశానని చెప్పారు. అలా ఫ్యాషన్‌తోనే మెన్స్‌ బ్యూటీ పార్లర్‌ పెట్టి ఉపాధి పొందుతున్నానని వివరించారు. తనకు దాదాపు 600 మంది వినియోగదారులు ఉన్నట్లు తెలిపారు. బియర్డ్‌ క్లబ్‌ అసోసియేషన్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నానని చెప్పారు.

సామాజిక సేవలో ఈ 'గడ్డం గ్యాంగ్' రూటే సెపరేటు!

'గడ్డం' ఛాంపియన్​కు అవార్డులు దాసోహం

ABOUT THE AUTHOR

...view details