Three People From Sangareddy Died Return From Mahakumbh :ఉత్తరప్రదేశ్ వారణాసి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ నీటి పారుదల శాఖ డీఈ వెంకటరామిరెడ్డి (46), ఆయన భార్య విలాసిని (40), మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి (42) ఉన్నారు.
ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన నిల్చున్న టిప్పర్ వాహనాన్ని కారు ఢీకొట్టడంతో వెంకటరామిరెడ్డి, విలాసిని, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వెంకటరామిరెడ్డి స్వస్థలం న్యాల్‌కల్ మండలం మామిడిగి కాగా, సంగారెడ్డిలో స్థిర నివాసం ఉంటున్నారు.