Three People Died in Road Accident in Kurnool District: ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియదు. కొన్నిసార్లు మనం చేయని తప్పులకు సైతం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు మనమే కాదు, మన పక్కన వెళ్తున్నవారు, ఎదుట వస్తున్న వాహనాలను సైతం గమనించాలి. అవతలి వాళ్లు తప్పు చేసినా మన ప్రాణాలకే ముప్పు. అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడుమూరు నుంచి కర్నూలు వెళ్తున్న ఐచర్ లారీ టైర్ పగిలి కర్నూలు నుంచి కోడుమూరు వైపు వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు బండ శ్రీనివాసులు, సోమశేఖర్, ఐడియా శ్రీనుగా గుర్తించారు. పట్టుచీరలు అమ్మి కోడుమూరుకు తిరిగి వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.
Bolero Hit A Lorry in Anantapur:అనంతపురం శివారు ప్రాంతం సోములదొడ్డి సమీపంలో బొలెరో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో సుబ్బారెడ్డి వాహనం డ్రైవర్ కాగా మరొకరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణ నాయక్ అని పోలీసులు గుర్తించారు.