Three Men Sexually Assaulted a Woman in Madhura Nagar : పని ఉందంటూ మహిళను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన దారుణ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే సోమవారం రాత్రి హైటెక్‌సిటీ క్రాస్ రోడ్‌లోని భవనంలో ఓ మహిళ పని ముగించుకుని వస్తుండగా ముగ్గురు యువకులు ఆటోలో వచ్చి బట్టలు ఉతికే పని ఉందని నమ్మించారు. అందుకు రూ.500 ఇస్తామని చెప్పారు. ఆ మాటలు నమ్మిన ఆ అమాయకురాలు వారి వెంట వెళ్లింది. ఆమెను యువకులు ఇంటికి తీసుకెళ్లారు.
వాళ్లు మాట్లాడుకున్నట్లుగానే ఆమెకు కొన్ని బట్టలు ఉతకడానికి వేశారు. ఆ మహిళ బట్టలు ఉతుకుతుండగా ఆ యువకులు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో పక్కింటివారు వచ్చేసరికి ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం బాధితురాలు మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ముగ్గురు యువకులు ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న యువకుల గురించి గాలింపు చర్యలు చేపట్టారు. మహిళను భరోసా కేంద్రానికి తరలించారు.
కోరిక తీర్చమంటూ బలవంతం - ప్రతిఘటించడంతో మహిళపై అత్యాచారం - ఆపై కాల్వలో పడేసిన యువకులు