Bears Halchal In Srikakulam : దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లిన వారికి గుడిలో గుండె పగిలే ఓ దృశ్యం ఎదురైంది. ఆలయం లోపలికి ఇలా వెళ్లగానే అలా ఎలుగు బంట్లు హల్‌చల్ చేస్తూ కనిపించాయి. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురంలోని శివాలయంలో జరిగింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా స్థానికంగా ఉండేవారు తెల్లవారుజామున శివుణ్ని దర్శించుకునేందుకు వెళ్లారు. లోపలికి ఇలా వెళ్లారో లేదో 3 ఎలుగుబంట్లు చొరబడ్డాయి. అలా అవి సంచరించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంట్లు అటూ ఇటూ తిరుగుతూ కాసేపు అలజడి సృష్టించాయి. దీంతో స్థానికులు కర్రలతో బెదిరించారు. కాసేపటికి ఎలుగుబంట్లు సమీపంలోని తోటల్లోకి వెళ్లడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎలుగుబంట్లతో సన్యాసి స్నేహం- ఆహారం, నీరు అందిస్తూ అన్నీతానై!
శివయ్యకు పూజలు చేసిన వానరం :పిలిస్తే పలికే స్వామి ఆ ఈశ్వరుడు, అలాంటి శివయ్యకు ఇష్టమైన కార్తిక మాసంలో భక్తులు భక్తి శ్రద్ధలతో భోళాశంకరుడిని నియమ నిష్ఠలతో పూజిస్తుంటారు. ప్రతి ఏడాది దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి ఈ కార్తిక మాసం మొదలవుతుంది. ఓం నమః శివాయ అనే నామస్మరణతో ప్రతి పల్లె, పట్టణంలోని శైవక్షేత్రాలు నెల రోజులపాటు మార్మోమోగుతుంటాయి. ఈ మాసానికి పురాణ కాలం నుంచి చాలా ప్రత్యేకత. కార్తిక మాసం ప్రారంభమైన దగ్గరి నుంచి భక్తులు విశేషంగా శివాలయాలకు తరలి వెళ్లి దీపారాధన చేస్తున్నారు.