ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతిభకు అడ్డురాని అంగవైకల్యం - భారత అంధుల క్రికెట్ టీమ్​ కెప్టెన్​గా ఎంపిక - Indian Blind Cricket team Captain

Indian Blind Cricket team Captain: ప్రతిభకు అంగవైకల్యం, పేదరికం అడ్డు కాదని నిరూపించాడు ఆ యువకుడు. అతనోక అంధుడు. అయితేనేం ఈ ప్రపంచాన్ని తన మనోనేత్రంతో జయించాడు. కంటి చూపు కోల్పోయినా తండ్రి మరణం బాధించినా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాడు. ఫలితంగా భారత అంధుల క్రికెట్‌ జట్టుకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు.

Indian_Blind_Cricket_Team_Captain
Indian_Blind_Cricket_Team_Captain

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 10:12 PM IST

ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించిన యువకుడు- భారత అంధుల క్రికెట్ టీమ్​ కెప్టెన్​గా ఎంపిక

Indian Blind Cricket team Captain: అంగవైకల్యం ప్రతిబంధకమైనా ప్రతిభలో ఎవరికీ తీసిపోనని ఘనంగా చాటి చెప్పాడు ఈ యువ క్రికెటర్‌. ప్రోత్సహిస్తే చాలు పతకాలతో దేశ కీర్తి, ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేస్తామని చేతల్లో చూపించాడు. భారత అంధుల క్రికెట్‌ జట్టుకు నాయకత్వం వహించి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. క్రికెట్‌పై మక్కువతో చిన్ననాటి నుంచి సాధన చేసిన ఈ క్రీడాకారుడు భారత క్రికెట్‌ అంధుల జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

పట్టుదల, కృషి ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అందుకు శరీరంలో లోపాలు ఏమాత్రం అవరోధాలు కాదని నిరూపించాడు విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పెరవలసకు చెందిన తొంపాకి దుర్గారావు. చిన్నతనంలోనే క్రికెట్ అంటే ఆసక్తి. తాను లోకాన్ని చూడలేకపోయినా అది ఏ మాత్రం అడ్డుకాదని అనుకున్నాడు. పట్టులదలతో క్రికెట్ నేర్చుకున్నాడు.

ఆశే ఆశయం - అవమానాలెదురైనా ఆగని పరుగు - ఒలింపిక్సే లక్ష్యమంటున్న యువకుడు - Abdulla Excels in Athletics

నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గారావు చిన్నతనంలోనే తండ్రి దాలయ్య మరణించారు. తల్లి సుందరమ్మ రెక్కల కష్టంతో దుర్గారావును పెంచి పెద్దచేశారు. విజయనగరం జిల్లా మెట్టవలస అంధుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఇంటర్‌ సికిద్రాబాద్‌లో, డిగ్రీ హైదరాబాద్‌లోని కాలేజీల్లో పూర్తిచేశాడు. అంధుల క్రికెట్‌లో భారత్‌ తరఫున రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.

రెండుసార్లు అంధుల వన్డే క్రికెట్‌ ప్రపంచ కప్, మూడుసార్లు అంధుల టీ-20 వరల్డ్‌ కప్‌ భారత్‌ కైవసం చేసుకోవడంలో దుర్గారావు కీలక పాత్ర పోషించాడు. 2014 భారత అంధుల క్రికెట్‌ జట్టుల్‌ రౌండర్‌గా ఆరంగేట్రం చేశాడు. 4 నవంబర్‌ 7 నుంచి డిసెంబర్‌ 25 వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన అంధుల క్రికెట్‌ ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2016 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు భారత్‌లో జరిగిన టీ-20 జట్టులో స్థానం లభించింది.

ఏదో సాధించాలనే తపన - కిలిమంజారో అధిరోహించి రికార్డు - IFS Officer Climbed Kilimanjaro

2018 జనవరిలో దుబాయ్‌లో జరిగిన అంధుల వరల్డ్‌ కప్‌లో కూడా ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చాటాడు. 2019లో వెస్టిండీస్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో సత్తాచాటి భారత్‌కు విజయాన్ని అందించాడు. 2022 భారత్‌లో జరిగిన వరల్డ్‌ కప్‌ విజయంలోనూ, ఇంటర్నేషనల్‌ బ్లైండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ (ఇప్సా) లండన్‌లో జరిగిన క్రికెట్‌ టోర్నీలో ద్వితీయ స్థానం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21నుంచి 26 వరకు దుబాయ్‌లోజరిగే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాల ముక్కోణపు టోర్నీకి భారత అంధుల క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించనున్నాడు.

"నా ఆశయానికి అమ్మే తోడు. నేను మంచి క్రికెటర్‌గా ఎదగాలని ఆకాక్షించాను. కష్టపడి సాధన చేశాను. నా ఆశయానికి మా అమ్మ సుందరమ్మ సహకారం తోడైంది. పాఠశాల, కళాశాలల్లో ఉపాధ్యాలు, స్నేహితులు ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నివ్వడంతో భారత అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాను. కష్టపడితే ఎంతటి విజయమైనా సిద్ధిస్తుందని నమ్ముతాను. ఇదే నా విజయ రహస్యం." - దుర్గారావు, భారత అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్

ABOUT THE AUTHOR

...view details