Thief Robbed Singareni Worker House in Mancherial: సాధారణంగా ఎవరైనా వేసవి సెలవులకు అమ్మమ్మ లేదా బంధువుల ఇంటికి వెళ్తే సరదాగా గడిపేసి వస్తారు. అక్కడ ఉన్న అన్ని రోజులను మంచి జ్ఞాపకాలుగా మార్చుకుంటారు. అయితే ఓ యువతి దీనికి భిన్నంగా ప్రవర్తించింది. తాను కూడా ఓ జ్ఞాపకంగా మార్చుకుంది. కాకపోతే అది వేరే లెవల్. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆ యువతి వాళ్ల ఇంట్లో నగదుపై ఆశ పడి చోరీ చేసింది. చివరికి పోలీసులకు చిక్కింది. ఈ దొంగతనంలో తన ప్రియుడు సాయం చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
మంచిర్యాల గ్రామీణ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన యువతి(19) బోయిన్‌పల్లికి చెందిన యువకుడు(22)తో ఆన్లైన్లో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వేసవి సెలవులు కావడంతో యువతి మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని నాగార్జున కాలనీలో ఉండే అమ్మమ్మ ఇంటికొచ్చింది. తాత గుమ్మడి సత్తయ్య సింగరేణి కార్మికుడు. స్థలం కొనుగోలు కోసమని రూ.4.50 లక్షల నగదును క్వార్టర్‌లో దాచుకున్నాడు. దీనిపై ఆ యువతి కన్నేసింది. ఈ విషయాన్ని చరవాణిలో యువకుడికి సమాచారం ఇవ్వడంతో హైదారాబాద్ నుంచి నస్పూర్‌లోని నాగార్జున కాలనీకి చేరుకున్నాడు. మే 27న గుమ్మడి సత్తయ్య విధులకు వెళ్లాడు. సాయంత్రం సమయంలో అమ్మమ్మ వాకింగ్ చేసేందుకు బయటకు వెళ్లింది.
మేడ్చల్ జిల్లాలో భారీ చోరీ - ఫంక్షన్‌కు వెళ్లొచ్చేలోపు దోచేశారు